[dropcap]మా[/dropcap]తృమూర్తి ఆనందం కోసం పరితపిస్తూ
నాన్న చెప్పే మంచిమాటలు ఆలకిస్తూ
అమ్మానాన్నల ప్రేమని అమృతంలా భావిస్తూ
అమ్మానాన్నల తో ఆత్మీయంగా మసులుకోవాలి!
తోబుట్టువులకు తోడూనీడగా వుంటూ
సహోదర భావాన్ని పెంపొందించుకంటూ
సోదరీసోదరులతో అభిమానంగా జీవించాలి!
కట్టుకున్న భార్యకి కన్నీరు రాకుండా
కష్టాలని దూరం చేస్తూ
ఉత్తమబంధంగా ఇలలో విఖ్యాతినందుకునేలా ముందుకు సాగాలి!
పిల్లల మనస్సులు గెలుచుకునేలా
అవసరానికి ఆదుకున్న నేస్తాలకి ఎన్నడూ వీడని మిత్రుత్వాన్ని పంచుతూ
జీవనయానం సాగించాలి!
అలాంటప్పుడే రోజువారి జీవితం ఆనందమయం అవుతుంది!
బంధాలు, బంధుత్వాలు, స్నేహాల విలువలు తెలుసుకుని..
అందరితో మంచిగా వుంటుంటే.. నిన్ను, నీ ఉనికిని అందరూ గౌరవిస్తారు!!