పరిపూర్ణ జీవితంలోకి

0
3

[dropcap]ఒ[/dropcap]క రసావేశపు మత్తులోంచి
జీవితాశయపు జగత్తులోకి
తలుపులు తెరిచి ప్రవేశిస్తామా
ఆ క్షణం –
ఆనంద బాష్పాలతో రెండు కళ్ళు చూస్తుంటే –
బాధామయ తప్తాశ్రవులతో రెండు కళ్ళు సజల మవుతాయి
పెదవుల మధువులు గ్రోలెందుకు
రెండు తనువులూ ఏకమవుతూ
వుంటాయా
ఓ మూల –
వేదనాభరిత హృదయం మూల్గుతూనే వుంటుంది
మూడు ముళ్ళ బంధంతో
ముప్పయ్యేళ్ళ బ్రహ్మచర్యం
తెల్లని పక్క మీద తెల్లవారేలోగా
అగాధాల అంచుల్లోకి తొంగిచూసి
మురిసిపోతుంది
ఉషోదయంతో జీవితం
పరిపూర్ణమవుతుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here