[dropcap]3[/dropcap]0.08.2020 నాడు విశాఖ సాహితి వేదికగా ‘ఘండికోట బ్రహ్మాజీరావు స్మారక సాహితీ పురస్కారం – 2020’ – జ్ఞాపిక, నగదు పురస్కారాలు ప్రముఖ కథకులు, నవలాకారులు, చిత్రకారులు శ్రీ శివల జగన్నాథరావుగారికి, కరోనా పరిస్థితుల దృష్ట్యా, వారి నివాసములో అందజేయడమైనది.
కీ.శే. బ్రహ్మాజీరావుగారి సతీమణి శ్రీమతి ఘండికోట సీతారామగారి అధ్యక్షతన, ‘ఘండికోట సాహితీపీఠం’ తరఫున 2017వ సంవత్సరము నుండి ప్రముఖ కథకులు, సాహిత్యకారులకు ఏటేటా ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతోంది.
గత సంవత్సరం వరకు, శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, శ్రీ మల్లాప్రగడ రామారావు, శ్రీ అదూరి వెంకట సీతారామమూర్తి గార్లు ఈ పురస్కార గ్రహీతలు.
విశాఖ సాహితి అధ్యక్షురాలు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు, శ్రీ మల్లాప్రగడ రామారావు గారు, శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, శ్రీ భమిడిపాటి సుబ్బారావు గారు, శ్రీ దూసి శ్రీరామమూర్తి గారు ఈ సందర్భంగా శ్రీ జగన్నాథరావు గారికి అభినందన సందేశాలు, చరవాణి ద్వారా తెలియజేసారు.
పురస్కార బహూకరణ కార్యక్రమంలో విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం, శ్రీ తాతా విశ్వనాథ శాస్త్రి, శ్రీ వేదుల కామేశ్వర శర్మ, జగన్నాథరావుగారి సహోదరి శ్రీమతి పార్వతి గారు, వారి తనయుడు పాల్గొన్నారు.
శ్రీ శివల జగన్నాథ రావుగారు ధన్యవాదాలు తెలియజేశారు.