[dropcap]ఎ[/dropcap]దగాలనుకుంటే
ఎగబ్రాకు
తప్పులేదు
దిగజారావా
లోకం ఒప్పుకోదు
అర్హత లేకున్నా
అడ్డ దారుల్లో
అందలాల్ని ఆశించకు
ఆత్మ వంచన చేసుకుని
అందరి పంచన చేరి
సమాజం వెలివేసేలా
ఎగతాళి చేసేలా
దొడ్డిదారుల్ని
అస్సలు ఆశ్రయించకు
యుద్ధం చేయాలనుకుంటున్నావా?
అది కత్తి అయినా
కలం అయినా
నీ సొంత బలంతోనే చెయ్
కదనరంగంలోనైనా
కవనరంగంలోనైనా
అరువు సొమ్ము
ఎప్పటికీ (బ)పరువు చేటే
ఆయుధంతోనైనా
అక్షరంతోనైనా
గెలుపు కోసం
అలుపు లేకుండా శ్రమించు
మెప్పు కోసమో
గొప్ప కోసమో
తప్పు చేసి తల దించుకోకు
వ్రేలెత్తి చూపించుకునేలా
ఎవరికో బాకాలు వూదకు
తలెత్తి బ్రతికేలా
అందరితో బాజాలు వూదించుకో