[dropcap]నా[/dropcap]డు…!
పంచశీలతో నెయ్యమందించి
నేడు…!
బాహ్య వలయాన్ని యుద్ధ మేఘాలతో బంధించి
అంతర్భాగాలలో కోవిడ్ కల్లోలాన్ని సృష్టించి
సరిహద్దు దేశాల కలుపుకుని
ధ్వజమెత్తినా ధీరలై నిలిచాం…!
ఊహూఁ
మీకు కరోనా చాలదు…
మేమూ ఉన్నాం…!
భూకంపాలు, తుఫాన్లు,
వరదలు, మిడతల దం(డు)డయాత్రల
ప్రకృతి ప్రకోపం…!
నలుమూలలా వెల్లువెత్తిన
పారిశ్రామిక విషవాయు విలాపం…!
ఎన్ని విలయాలెదురైనా
ఎదురొడ్డి పోరాడుతాం!
ఏకత్వంలో భిన్నత్వం
భిన్నత్వంలో ఏకత్వం
ఏకైక ఐక్యతా సూత్రం!
ఎప్పటికీ విజయం మాదే! మాదే! మాదే!
మాదీ…!
ఆత్మ నిర్భర భారతం.