[dropcap]”తె[/dropcap]లుగు సాహిత్యం: తొలి యౌగికకావ్యం ‘నేను'” పేరిట యోగాలయ రీసెర్చ్ సెంటర్, సికింద్రాబాద్ నిర్వహణలో ‘సప్తపథ సమాలోచన సదస్సు’ ఈ నెల శనివారం 19 నుండి శుక్రవారం 25 వరకు ప్రతిరోజు రాత్రి 7.15 నుండి 8.45 వరకు మీ ఇల్లే వేదికగా ‘గూగుల్ మీట్’ అంతర్జాలం ద్వారా ఏడురోజుల పాటు జరగనున్నాయని సదస్సు సంచాలకులు హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి తెలిపారు. విశ్వర్షి డా. వాసిలి వసంతకుమార్ రచించిన “నేను” తొలి తెలుగు యోగిక కావ్యంగా ఇప్పటికే పరిశోధకుల, విమర్శకుల, పత్రికల, కవుల, సాహిత్యాభిమానుల మన్ననలు పొందిందని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిఒక్కరికి ఈ దీర్ఘకవితపై మరింత అవగాహన కల్పించేందుకు సమాలోచన సదస్సును నిర్వహిస్తున్నామని, దేశ విదేశాల్లోని ప్రతిఒక్కరు పాల్గొనేందుకు అనువుగా భారతకాలమానం ప్రకారం రాత్రి 7.15 నుండి 8.45 వరకు జరిగే సదస్సులలో ముగ్గురు సాహిత్య ప్రముఖులు పత్రసమర్పణ చేస్తూ “నేను” కావ్యంపై ప్రసంగిస్తారని తెలిపారు.
డా. వేటూరి ఆనందమూర్తి, డా. రేవూరి అనంతపద్మనాభరావు, శ్రీ నేమాని సోమయాజులు, డా. పులికొండ సుబ్బాచారి, డా. దీర్ఘాశి విజయభాస్కర్, శ్రీ ఉలి, డా. మాడభూషి సంపత్కుమార్, డా. బి. అనిల్ కుమార్, శ్రీ పాలకుర్తి రామమూర్తి, డా. డి. విజయలక్ష్మి, డా. లక్ష్మణ చక్రవర్తి, శ్రీమతి అరుణ నారదభట్ల, డా. మేడిపల్లి రవికుమార్, డా. పెరుగు రామకృష్ణ, డా. వి. భానుపావని, డా. కొలకలూరి ఆశాజ్యోతి, డా. దార్ల వెంకటేశ్వర రావు, శ్రీమతి యలమంచిలి శైలజా వెంకటరావు, డా. కోలవెన్ను మలయవాసిని, డా. గన్నమరాజు గిరిజమానోహరాబాబు, డా. సాగి కమలాకర శర్మ “నేను” దీర్ఘకవితను వివిధ దృక్పథాలలో ఆవిష్కరించనున్నారు.
ఉస్మానియా, కాకతీయ, మద్రాసు, ఆంధ్ర, కాకతీయ, తెలంగాణ, బెంగళూరు, హైదరాబాద్ ఆచార్యులు, పలువురు ఆధ్యాత్మికవేత్తలు, సాహిత్యవిమర్శకులు, కవులు తమ ‘నేను’ కావ్యంపై సమాలోచన చేస్తుండటం వల్ల మరింతగా పరిశోధనలకు, అనుశీలనలకు అవకాశం ఏర్పడుతుందని కావ్యకర్త విశ్వర్షి వాసిలి అన్నారు. మరిన్ని వివరాలకు 93939 33946, 99490 58661 లపై సంప్రదించవచ్చని తెలిపారు.
stream.meet.google.com/stream/7721536a-9ccd-47e8-8729-a9adb1aca818
గూగుల్ లైవ్ స్ట్రీమ్ లింక్ ద్వారా ప్రతిరోజూ ఈ సదస్సును ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.