వారాల ఆనంద్ హైకూలు-5

2
3

[dropcap]సం[/dropcap]చిక పాఠకుల కోసం శ్రీ వారాల ఆనంద్ రచించిన 8 హైకూలను అందిస్తున్నాము.

 

1)
మూడుగంటల రాత్రి
ఎవరో పిలిచినట్టయ్యింది
హరి వెళ్లి పోయాడు
~

2)
ఉదయాన్నే ఆకాశంలో
పక్షులు వలస
ఆత్మీయులు కదిలిపోతున్నారు
~

3)
కళ్ళ ముందు
ఎన్నెన్నో ముఖ చిత్రాలు
గుండెల్లో ఒకటో రెండో మిగిలి పోతున్నాయి
~

4)
హరి వెళ్తూ వెళ్తూ
సంచీలో పంచాంగాన్నీ
చీకటిలో నన్నూ వదిలేసాడు
~

5)
రాలి పోతున్న వృద్ధులు
జన సాంద్రత మధ్య
మోగుతున్న మరణ మృదంగం
~

6)
వికసించె పూల నడుమ
చిన్నూగాడి గుస గుస
తనలో తానే
~

7)
పెద్దగా అలిసి పోలేదు
త్వరగా నిద్రపోవాలి
కలలకు స్వాగతం చెప్పాలి
~

8)
మచ్చా మారకా లేని
తెల్ల కాగితం దర్జాగా
విశాలంగా పరుచుకుని వుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here