[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఏడుకొండలవాడిని రెండుసార్లు స్మరిస్తే ఆర్జీవి గుర్తుకువస్తాడా? (3,3) |
4. హెడ్డుతో ఫేటు (4) |
7. మూడు దోసిళ్ల ధాన్యం. (2) |
8. సరిలేని గంధపలితో తట్ట (2) |
9. థియోసాఫికల్ సొసైటీ వారి పత్రిక (4,3) |
11. 60 సెకన్లు (3) |
13. కపింజల పక్షి (5) |
14. కొంగర జగ్గయ్య కొన్నాళ్లు ఉపసంపాదకుడిగా పన్జేసిన పత్రిక (5) |
15. వియత్నాం దేశం పరదేశమేగా? (3) |
18. ఏడు పిడచల ఆహారం మాత్రమే తిని ఆచరించే ఒక వ్రతవిశేషం. (2,5) |
19. పటాకీలతో సిల్వర్ స్క్రీన్ (2) |
21. సర్వకాలాలలో అగుపించే పాత్ర (2) |
22. కలం కలిగిన కంఠాభరణం (4) |
23. అంజలీదేవి, ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రివర్సయ్యింది. (6) |
నిలువు:
1. కోకిలము మొదట్లో సరళమైతే ముసలం పుట్టుకొస్తుంది. (4) |
2. ఆశ్చర్యం (2) |
3. తోక కలిగిన కార్చిచ్చు (5) |
5. పుప్పొడి చివర్లో స్వర వర్ణాలంకితమై శ్రోతలను రంజించే ధ్వని.(2) |
6. ఛాయాదేవి (6) |
9. తరక కలిగిన యమునా నది. (4,3) |
10. సాధారణంగా మునిమనుమడు పుడితే ఆ వ్యక్తికి చేసే సన్మానం. (7) |
11. ఆదోని డివిజన్‌లో పొడవైనది. (3) |
12. ఈ మెస్సేజిలో కొంత విలాతి ఉంది. (3) |
13. తన్హాయి నవలాకారిణి (3,3) |
16. రెక్కాడినంతకాలం నవలాకారుడు (5) |
17. భాగవతుల సదాశివ శంకరశాస్త్రి మాదిరి జన్మనక్షత్రాన్ని కలంపేరుగా పెట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగించిన పలువురు రచయితలలో ఒకరైన మహీధర రామాశాస్త్రి కలం పేరు. (4) |
20. పల్లకీలందలాలలో దాగియున్న మర్మము (2) |
21. సవతి జాడ కనుక్కోండి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 అక్టోబరు 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 అక్టోబరు 11 తేదీన వెలువడతాయి.
పదసంచిక-71 జవాబులు:
అడ్డం:
1.కందిగుండాచమే 4. సంవేదన 7 ప్యూతి 8. శిఖ 9. సర్వజ్ఞ వచనాలు 11. విసల 13. కరోనాజపం 14. తిమ్మాపురము 15. చిలుక 18. నమస్తే తెలంగాణ 19. న్యాల 21. ఆసు 22. సితద్యుతి 23. ఆకాశరామన్న
నిలువు:
- కంప్యూటరు దితి 3. మేధోవలస 5. దశి 6. నఖరాయుధము 9. సహస్రనామార్చన 10. లువేలుపులగాణ 11. విపంచి 12. లతిక 13. కపట సన్యాసి 16. లుగుతెకుఆ 17. గుండు సున్న 20. లత 21. ఆమ
పదసంచిక-71కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- సి.మనస్విని
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కన్యాకుమారి బయన
- కృష్ణారావు భాగవతుల
- కోట శ్రీనివాసరావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మొక్కరాల కామేశ్వరి
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్యా మనస్విని సోమయాజుల
- ఎస్. శ్రీనివాసరావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.