సవారి కచ్రం

2
3

[dropcap]స[/dropcap]వారి కచ్రం…
నులక మంచాల కాలంల
నవార మంచం లెక్క..!
ఎటు పోవాలన్నా
సడకు లేని రోజుల్ల నడ్మంత్రపోల్లకు
నడకనే గతి…
కాపుదానపోల్లేమో
కచ్రంల పోతుండ్రి…
దొర దొరసాని తోటి
కాపయ్య కాపవ్వ తోటి
పొలంకాడికి పోవాలన్నా
పొలిమేర దాటేదున్నా
గంటలు మెడలేసిన
జంట ఎడ్లు కట్టిన
సవారి కచ్రం
బరాబరి ఎక్కుడే…

ఎండా వాన పడకుంట
కంక బద్దల కప్పునం తోటి
కింద వరి గడ్డి వరిసి
తెల్లటి సెద్దరి మీద
మెత్తగ కూసుందురు
మొత్తానికి ఇద్దరే,,.
ఎనుకా ముందు డేరలే
ఆ కాంత తోటి ఏకాంతం కోసం…
ముంగట పాలేరు
పగ్గాలు సేతుల…

గల్లు గల్లు గజ్జెల సప్పుడు తోటి
సవారి కచ్రం సడకు మీద ఎక్కుతే…
గా రాస్తాకే రాజిర్కం అత్తుండే…
గప్పుడు సవారి కచ్రం ఉన్నోళ్లు
గీ కాలపు బెంజి కారు ఓనర్లతోటి సమానం…

సిన్నప్పుడు దాన్ని సూసి మురిసిన…
ఎక్కే నసీవ నాకు రాలే…
ఇయ్యల్ల కార్ల తిరుగుతున్నా
సవారి కచ్రంల ఎక్కుడన్నది
తీరని కోరికనే …నాకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here