[dropcap]ఏం[/dropcap]టో కరోనాట
సైజ్ చూస్తే జీరో
కానీ యావత్తు భూగోళాన్నే
గడగడలాడిస్తోందిగా
అమెరికా పెద్దన్న
చైనా చిన్నన్న
ఇరాక్ ఇరుగన్న
పాక్ పొరుగన్న
జపాన్ జంపన్న
ఫ్రాన్స్ ఫాషనన్న
స్పెయిన్ స్టైలన్న
ఎవరన్నా వదలడంలేదుగా
గొప్పొలన్నా విడవదుగా
కరోనా అంటేనే కలవరం
మందు కనిపెట్టలేక
పనిపట్టలేకపోతున్నారుగా
దేవుడు ఉన్నాడనుకోవాలా
మానవుడు ఏం కాదనుకోవాలా
ఏది ఏమైనా కరోనా
చెడు ఎంత చేసిందో
అంత మంచీ చేసింది
మనిషి మనిషిని కలిపింది
అతని స్థితి ఏంటో కూడా తెలిపింది