సంభాషణం: ఆర్. జె. హాస్య అంతరంగ ఆవిష్కరణ

1
3

[box type=’note’ fontsize=’16’] ఈఎఫ్‌ఎమ్‌తో ‘అమ్మ నా కోడలా’ అంటూ శ్రోతలను కడుపుబ్బా నవ్విస్తూ అలరించే ఆర్‌.జె. హాస్య గారితో సాధన గారు జరిపిన ముఖాముఖిని సంచిక పాఠకులకు అందిస్తున్నాము. [/box]

కుటుంబం విద్యాభ్యాసం

శ్రీమతి సరోజిని ( కీర్తిశేషులు) శ్రీ వీరాస్వామి గార్లు తల్లి తండ్రులు. ఇద్దరు అన్నయ్యలు.

ఎంసిఏ చదువుకున్నాను.

ఆర్ జె ఎలా అయ్యారు?

RJ అని ఒక పోస్ట్ ఉంటుందనీ ముందు తెలీదు. రేడియోలో పని చేసే కొందరి ఇంటర్వ్యూ లు విన్నా. ఇలా పార్ట్ టైం కూడా చేయోచ్చు అని తెలుసుకుని ఆల్ ఇండియా రేడియోకి ఆడిషన్‌కి అప్లయ్ చేశా. అప్లయ్ చేసిన సంవత్సరానికి కాల్ లెటర్ వచ్చింది. ఆడిషన్స్‌కి రావాలని. మామూలుగా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసే ముందు మా నాన్న ఆల్ ద బెస్ట్ అంటే పని అద్భుతంగా అవుతుంది. ఎందుకులే అంటే అవ్వదు. అలాంటిది రేడియోలో ఆడిషన్‌కి వద్దన్నా వెళ్లా. సెలెక్ట్ అయ్యా… రాసి పెట్టి ఉంటే జరుగుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ.

చేసిన కార్యక్రమాలు ఇష్టమైనవి?

కార్పోరేట్ రేడియో ఈఎఫ్‌ఎమ్‌లో 3 సంవత్సరాలుగా చేస్తున్నా. ఆల్ ఇండియా రేడియోలో నా కాలేజ్ టైం నుండి వర్క్ చేస్తున్నా..

ఆల్ ఇండియా రేడియోలో చేసినప్పుడు దాదాపు అన్ని రకాల షోస్ చేశా. అక్కడ అలాంటి అవకాశం ఇస్తారు కూడా. ప్రస్తుతం ఈనాడు వారి ఈఎఫ్‌ఎమ్‌లో ఆర్ జె కమ్ ప్రొడ్యూసర్ కమ్ మ్యూజిక్ స్కెడ్యులర్ (Scheduler) గా వర్క్ చేస్తున్నా.

ప్రెసెంట్ చేస్తున్న రేడియో వల్ల కొంత గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు.

ఒకటి నా షో ఈ – మార్నింగ్ ( E-Mornings )

ఇంకొకటి అత్తా కోడళ్లు అనే ఒక కాన్సెప్టు లో అత్త గా మాట్లాడతా..

ఈ రెండిటి వల్ల గుర్తింపు వచ్చింది.

వ్యక్తిగత జీవితం, వృత్తి ఎలా బ్యాలన్స్ చేస్తారు?

ఆ బ్యాలన్స్ ఇంకా కుదరట్లేదు అని చెప్పాలి. ఏదో ఒక పని ఆగిపోతుంది. తరువాత రోజు చేయడం. మిగతా వారంతా ఎలా చేస్తారో కానీ బ్యాలన్స్. హాట్సాఫ్ టు దెం. ఇంటి పని, ఆఫీస్ పని రెండూ బాగా చేయగలుగుతున్నారు అంటే 24 గంటలు పని చేస్తున్నట్టు. నా వంతు నేను కృషి చేస్తున్నా. మా ఇంట్లో అందరూ బాగా సపోర్ట్ చేస్తారు.

రోజూ ఎన్ని గంటలు పని చేస్తుంటారు?

ఎగ్జాక్ట్‌గా ఇన్ని గంటలు అనైతే నాకు లేదు. అవసరాన్ని బట్టి ఒక రోజు ఎక్కువ, ఒక రోజు నార్మల్ గా వర్క్ చేస్తా. కాకపోతే, నచ్చిన పని కాబట్టి పెద్దగా అలసట ఉండదు.

చాలెంజెస్?

ప్రతీ రోజు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఒక్క రోజు షో చేసి ఇంప్రెస్స్ చేస్తే సరిపోతుంది అని కాదు. ప్రతీ రోజు కొత్తదనం మన మాటల్లో, కంటెంట్‌లో చూయించాలి. అంటే ఎవ్రీడే ఇంప్రెస్ చేయాలి. అంటే ప్రతీ రోజు చాలెంజే.

ప్రభావితం చేసిన వ్యక్తులు?

చాలా మంది దగ్గర చాలా నేర్చుకుంటాం. అలా నేను నేర్చుకున్నా. మా నాన్న దగ్గర పేషెన్స్ నేర్చుకున్నా. మా అమ్మ దగ్గర ఫ్యామిలి ముఖ్యం అనేది నేర్చుకున్నా. మా అన్నల దగ్గర పంచ్ డైలాగ్స్ నేర్చుకున్నా… బయట ప్రతీ రోజు ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా. అది లాంగ్వేజ్ దగ్గర నుండి బాడీ లాంగ్వేజ్ వరకు. హహహ

ఆర్ జె కాకపోయి ఉంటే?

ఆర్ జె నే అవుతా అనుకోలేదు… మిగతా వారిలా… ఏ IT కంపెనీలోనో ఉద్యొగం చేసేదాన్ని.

కరోనా సమయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు?

ఇలాంటి ఒక పరిస్థితి నిజంగా చూస్తాం అనుకోలేదు. ఇలాంటివి ఇంగ్లీష్ మూవీస్‌లో చూసే వాళ్ళం చిన్నప్పటి నుండి. సినిమా కోసం తీసారు, ఇలాంటివి నిజంగా జరగవు అనుకున్నా… బట్, లైవ్‌లో చూస్తున్నాం. ఆఫీస్‌కి అంటే వెళ్లక తప్పదు కాబట్టి వెళ్తున్నా… మాస్క్ లేకుండా బయటికి వెళ్ళను. చాలా అవసరం అంటేనే ఇల్లు, ఆఫీస్ కాకుండా బయిటికి వెళ్తున్నా.. శానిటైజర్ ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటున్న. ఏ వస్తువు తెచ్చినా… ఒక 4-5 hrs బయటే పెట్టీ, ఆ తరువాత అవసరాన్ని బట్టి క్లీనింగ్ అయితే క్లీనింగ్ లేదా శానిటైజ్ చేసి లోపలికి తీసుకెళ్తా.

అందం ఆరోగ్యం కోసం?

అందానికి నాకు పెద్ద దోస్తీ లేదు. నా వరకు అందం అంటే ఆనందం. హ్యాపీగా ఉన్న రోజు… మనం కూడా మెరుస్తాం. లేదంటే డల్‌గా ఉంటాం. అంతా మన బ్రెయిన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ ధ్యాస చూపిస్తాను. అందరిలాగే అన్నీ తింటాను, ఎక్కువ క్యాలరీలు చేరాయి అనిపిస్తే దానికి పరిహారంగా ఫ్రూట్స్ , వాటర్ ఇలా మాత్రమే తీసుకుంటా.

ప్రోత్సహించేవి?

నీ షో బాగుంది, నీ వాయిస్ బాగుంది, అత్త గా భలే మాట్లాడతారు అనే మాటలే అవార్డులు ప్రస్తుతానికి. ఆ మాటలే ఇంకా బాగా చేయాలనే బూస్టింగ్‌ని ఇస్తాయి.

మీ అందరి సపోర్టు అండ్ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా అవార్డ్ గెలుస్తా.

~

మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృతజ్ఞతలండి.
మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ…
సాధన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here