[box type=’note’ fontsize=’16’] 25 సెప్టెంబరు 2020న మృతి చెందిన ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ కవిత ద్వారా నివాళి అర్పిస్తున్నారు చందలూరి నారాయణరావు. [/box]
[dropcap]పా[/dropcap]టకై
పుట్టిన
‘బాలు’డు
‘పల్లవి’
మెచ్చిన
శబ్దం
‘చరణం’
నడచిన
అర్థం
మరణం
లేని
‘గాత్రం’
దేవుడు
కూర్చిన
స్వరం
కళ
కలకన్న
కమ్మని రాగం
అతడు
బాలుడు కాదు
‘దేవుడు’
అది గానం
కాదు
ప్రాణం
అది గాత్రం
కాదు
మనసుకు చత్రం.
అది జీవితం
కాదు
ప్రపంచం.