[dropcap]నా[/dropcap]ది భగ్న హృదయం
అది అగ్నినిలయం ॥నాది॥
నీ మాటలకే అయితినే
ఆనాడు నేను ప్రభావితం
నీ చూపులే అయినవే
ఈనాడు విషపూరితం ॥నాది॥
నీ కలయికే ఒక శాపం
చెందుతున్నా పరితాపం
నాది రగులుతున్న కోపం
పండుతుంది తప్పక నీ పాపం ॥నాది॥
గొంతులో హాలాహలం
గుండెలో దావానలం
నా మది పగిలిన శకలం
అయినదిలే కకావికలం ॥నాది॥
లేదు నీపై ఏ వ్యామోహం
ఇది తీరని ద్వేషాగ్ని దాహం
భరిస్తాను తప్పదు ఈ విరహం
కోరుతున్నాలే నీతో కలహం ॥నాది॥