[dropcap]అ[/dropcap]నంతంగా
కదిలే నీడలు
విశ్రమించని నీడలు
మరణ మృదంగమై వినిపిస్తూ
అదిగో
అప్పుడే
హృదయం ముక్కలై
విరిగిపడుతుంది
దుఃఖం నదిగా పొంగుతుంది
తాళలేక ఆనకట్ట వేయాలనుకుంటావు
కానీ
దుఃఖం
మరింత పొంగుతూ
కథలు కథలుగా
ఆవిష్కృతమవుతూ వుంటాయి
అందులో జీవితం
ఓ చేపపిల్ల ఈదుతూనే వుంటుంది.