అందం, బందీ అయింది

0
3

[dropcap]అం[/dropcap]దం ఎక్కడో బందీ అయిందట…
నీకేమైన తెలుసా ??

అది
వంపుతిరిగి వయ్యారాలుపోయే
కనుబొమల్లో కాపురముంటుందట
నీవు చూసావా ?

అది
కలువల్ని తలదన్ను
కళ్ళతో కలిసి ఆడుకుంటుందట
నీవు గమనించావా ?

అది
కోటేరుతో పోటీకి సైయనే
ముక్కుతో ముచ్చటెట్టుకుంటుందట
నీవు విన్నావా ?

అది
హరునివిల్లై విశ్రాంతి పొందేటి
పెదువులతో ముద్దులెట్టుకుంటుందట
నీవు పరికించావా ?

అది
ముత్యాలు వెలవెలబోయే తెలుపుతో
మెరిసేటి పల్వరస కూడి ఉంటుందట
నీవేమైనా జాడ కనిపెట్టావా ?

అది
నిండు చందమామను పోలి
నిగనిగలాడేటి
నిండైన మోమున నిలిచిపోతుందట
నీకు అగుపడిందా ?

ఫాలభాగాన మెరిసేటి బొట్టు అదేనా!
బుగ్గలలో రంగులీనే మెరుపు అదేనా!!
జాలువారే కురుల కారునలుపు అదేనా!!!
జంటపెదవులనంటి జాలువారే నవ్వు అదేనా!!!!

నాకేదో సందేహమేస్తోంది, నిన్ను చూస్తుంటే
ఆ అందం….
అవును … అవునవును
ఆ అందం …..
నీ దగ్గరే బందీ అయింది కదూ!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here