[dropcap]పా[/dropcap]ఠకుల చేత చిన్న కథలు చదివింపచేయాలనే లక్ష్యంతో ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో ద్వితీయ ‘చలపాక వీరాచారి స్మారక పోస్టకార్డ్ కథల పోటీ’ నిర్వహిస్తున్నది.
వర్తమాన పరిస్థితులను ప్రతిబింబింపచేసే అంశంతో కూడిన పోస్ట్ కార్డు కథలు ఒకరు ఎన్నైనా పోస్ట్ కార్డు పై మాత్రమే రాసి పంపించవచ్చు. ఉత్తమంగా ఉన్నవాటికి
- ప్రథమ బహుమతి రూ.1000/
- ద్వితీయ బహుమతి రూ.500/
- తృతీయ బహుమతి 300/
- మరో 2 కథలకి 100/-చొప్పున ప్రోత్సాహక బహుమతులుంటాయి.
ఈ పోటీలో గెలిచిన విజేతలకు నగదు బహుమతులతోపాటు, ప్రశంసాపత్రాలు పోస్ట్‌లో పంపబడతాయి.
పోటీలో బహుమతి పొందిన కథలను ‘రమ్యభారతి’ పత్రికలో వరుసగా ప్రచురింపబడతాయి.
రచయితలు తమ పోస్ట్ కార్డు కథలను డిసెంబర్ 15, 2020 తేదిలోపు– రమ్యభారతి, పోస్ట్ బాక్స్ నెంబర్. 5, విజయవాడ 520001 చిరునామాకు కేవలం పోస్ట్‌లోనే పంపాలి. – చలపాక ప్రకాష్, ఎడిటర్, రమ్యభారతి