[dropcap]క[/dropcap]రోనామ్మ తల్లి – పెద్దమ్మోరే!
గ్లోబుని గిర్రున తిప్పింది
పేరుతోనే ఝళిపించింది
కళ్లకి గంతలు విప్పమంది!
చరిత్ర పుటలు తిప్పమంది
పెద్దల బోధలు చదవమంది
చైతన్యమంటే చూడమంది
వేగంగా ముందుకి దూకింది!
మనుషుల మధ్యే దూరమంది
కుటుంబమంతా ఒక్కటంది
అందరి బాధ్యతలు తెలిపింది
కలిసి ఉంటేనే సుఖమంది!
గుంపు గుంపుగా వద్దంది
దూరం దూరం జరగమంది
ముక్కూమూతీ ముయ్యమంది
మూగితే ముప్పు తప్పదంది!
మంచితనంతో మెలగమంది
అందరి మంచిని కోరమంది
తాకడమసలే వద్దంది
ఆరడుగుల దూరం హద్దంది!!