[box type=’note’ fontsize=’16’] గత వారం మృతి చెందిన ప్రముఖ రచయిత, సంచిక కాలమిస్ట్ శ్రీ వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి నివాళి అర్పిస్తోంది సంచిక. [/box]
[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రచయిత, బాల సాహితీవేత్త, సంచిక కాలమిస్ట్ శ్రీ వేంపల్లి రెడ్డి నాగరాజు గత వారం ఆకస్మికంగా పరమపదించారు.
కవిగా ప్రతిష్ఠులైనా, కథకుడిగానూ విశేషంగా రాణించారు వేంపల్లి రెడ్డి నాగరాజు.
ముఖ్యంగా మినీ కథలు, నానో కథల స్పెషలిస్టుగా పేరుపొందారు.
సంచిక వారికి అంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.
వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థిస్తోంది.