[dropcap](వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు కు స్మృత్యంజలి)
~ ~
నింగి కి పొగరెక్కువ …
తానే అందనంత ఎత్తులో ఉన్నానని …..
తన నెవరు ఛేదించలేరని …..
నేలూనుకొని
సాహితీ పరమాణువుల శక్తిని
తనలో సంలీనం చేసుకొని
సంస్కార భావాల్ని
కొంగ్రొత్త రూపంలో
మన మెదళ్లలోకి గురిచూసి చొప్పిస్తూ
ఎదుగుతున్న మన మిత్రుడు …..
తనను కబళించి ..
తనకన్నా ఎత్తుకు ఎదుగుతాడని ఊహించి ..
పొగరుతో పురుడుపోసుకున్న అసూయతో ….
మిత్రుడి ఆత్మని తనలో కలిపేసుకుని
దేహాన్ని నేలకు వదిలేసి
వికటాట్టహాసం చేసింది …..
కానీ………………………
నింగికీ తెలియని నిజమొకటుంది…..
నింగినే నేలగా చేసుకొని
అత్యంత ఎత్తుకు , అంతకన్నా ఎత్తుకు ఎదగడం
మనవాడి సహజసిద్ధ స్వభావమని…….