సుప్రసిద్ధ కవి, పాaత్రికేయులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ దేవీప్రియ ది 21 నవంబరు 2020న హైదరాబాదులో స్వర్గస్థులయ్యారు.
వీరు ఉదయం, ఆంధ్రప్రభ, హైదరాబాద్ మిర్రర్, ది హాన్స్ ఇండియా వంటి పత్రికలో పని చేశారు.
‘రన్నింగ్ కామెంటరీ’ అనే వీరి పొలిటికల్ కార్టూన్ స్ట్రిప్ బాగా పేరు పొందింది.
అమ్మ చెట్టు, నీటి పుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, గాలి రంగు వంటివి ఆయన ప్రసిద్ధ రచనలు.
వీరి మృతి సాహితీ లోకానికి తీరని లోటు.
వారికి నివాళి అర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది సంచిక.