[box type=’note’ fontsize=’16’] భారత స్వాతంత్ర్యపోరాటం గురించి, పలు వైజ్ఞానికాంశాల గురించి నేటి బాలబాలికలకు ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[dropcap]బా[/dropcap]లలు ఇక్కడమీకు భారత దేశ చరిత్ర కొంత వివరిస్తాను అన్నతాత……
ప్రాచీన భారతదేశ చరిత్రలో రాజులు రాజ్య సంపాదన, రాజ్యనిర్వాహణ లక్ష్యంగా పాలించారు. కానీ మధ్యయుగమలో భారదేశంలో మహ్మదీయపాలకులు రాజ్యాధికారానికి తోడు మతాధికారాన్నికూడా కైవశం చేసుకున్నారు. ఆధునిక యుగంగా పిలుస్తున్న బ్రిటీష్ వారికాలంలో ఆంగ్లేయులు రాజ్యాధికారాన్ని, మతాధికారంతో పాటు ఆర్థిక వ్యవస్ధ కూడా తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు.
మనదేశానికి సముద్రమార్గాన దాదాపు ఆరువేల మైళ్లదూరం ప్రయాణించి వారి దేశంకన్న ఇరవై రెట్లు పెద్దదైన భారతదేశాన్ని వశపరచుకోవడం గొప్పవిషయం. నాటి భారతీయ పాలకులలో ఉన్న బలహీనతలను ఆంగ్లేయులకు బలాన్ని చేకూర్చాయి. సంఘటితం, స్నేహభావం, సహాకారం నాటి రాజులలో కొరవడింది. కనక పరాయివారు మన పాలకులు అయ్యారు. మనదేశానికి పోర్చుగీసువారు, డచ్చివారు తర్వాత ఆంగ్లేయులు, ప్రెంచ్ వారు వ్యాపార నిమిత్తం వచ్చి పాలకులుగా మారారు. క్రీ.శ.1600లో స్ధాపించిన ఈస్టిండియా కంపెనీని అదే సంవత్సరం సంవత్సరం డిసెంబర్ 31న ఎలిజబెత్ రాణి ఒక వ్యాపార సంస్ధగా రాజాజ్ఞ జారిచేసింది.
1612 సంవత్సరం ప్రాంతంలో మోగల్ చక్రవర్తి అనుమతితో సూరత్‌లో వ్యాపారకేంద్రం (ఫ్యాక్టరి) స్ధాపనకు ఈస్టిడియా కంపెని అనుమతి పొందింది. అలా 1647 నాటికి 23 ఫ్యాక్టరీలు ఏర్పరిచారు. వీటిలో బెంగాలులోని పోర్టు విలియం కోట, మద్రాసు పోర్టు సైంట్ జార్జి కోట, బాంబేలో రెండవ చార్లిసు కోటలుగా అభివృధ్ధి చెందాయి. ఆ కంపెని రక్షణ కోసం మొదట వందలసంఖ్యలో ఉన్న సైనికులు, 1778 నాటికి సైనికుల సుంఖ్య అరవై ఏడు వేలకు చేరింది.
రాజ్యాధికారం సాధిస్తే అధికలాభాలు తమకే దక్కుతాయి అని పసిగట్టిన ఆంగ్లేయులు 1600 నుండి 1757 వరకు బ్రిటీష్ వారు తమ వ్యాపారానికి అడ్డం కలిగించే ఇతర ఐరోపా వ్యాపారులతో పోరాటం చేసి వారందరిని భారతదేశం నుండి సాగనంపారు.
1764లో ‘బక్సర్’ యుధ్ధం జరిగింది. దీనిలో విజయం వారు సాధించారు. ఈ విజయం క్రమంగా భారతదేశాన్ని బానిసత్వంలోనికి నెట్టింది. ఉత్తర భారతదేశం, ఒక్కొక్క ప్రాంతం కంపెనీవారి ఆధీనం అయింది. దక్షిణ భారతదేశంలో హైదర్ అలి, టిప్పు స్తుల్తాన్, మైసూర్ పాలకులు గట్టి ప్రతిఘటన ఇచ్చినప్పటికి, చివరకు 1799లో టిప్పుసుల్తాన్ మరణంతో ఈస్టిండియా కంపెనీవారు దక్షణాదిన కుదురుకున్నారు.
1758 నుండి 1858 వరకు రాజ్యాన్ని సంపాదనకు ప్రాధాన్యతను ఇచ్చి సంపూర్ణ విజయం సాధించారు. 1740 నాటి నుండి భారతదేశంలో సమర్థవంతమైన దేశ సమైక్య పాలకులు ఎవరు లేరు. నాటికే అయోధ్య, బెంగాలు, హైదరాబాద్ రాజ్యాలు నాటి పాలకులను కూలద్రోసి మైసూర్, మహరాష్ట్ర రాజ్యాలు వెలసాయి. వందలకొద్ది చిన్నచిన్న రాజ్యాలు వెలసాయి. అనైక్యతా భావం, భోగలాలసం, వెన్నుపోట్లతో నాటివారు పతనమైనారు.
క్రీ.శ.700 లో మెదట మహ్మదీయులు గుజరాత్‌లో కాలు మోపారు. క్రీ.శ.1200 మహ్మదీయరాజ్యం ఏర్పడింది. అతకు పూర్వం అనేక తెగలు భారతదేశానికి వచ్చాయి. ఆర్యుల సంగతి వదిలివేసినా, శక, యవన, హుణు తదితర తెగలవారు వచ్చారు. వీరంతా కాలక్రమేణా హిందూ మతంలో కలసిపోయారు. రాజపుత్రులు, అభీరులు, ప్రతిహారులు, ఛండేలరాజులు, పాల వంశస్తులు పెక్కుమంది ఈ విధంగా మతాంతీకరణ చెందిన పరాయి తెగలవారే.
***
బాలలు మరలామనం వందేమాతరం కథ లోనికి వెళదాం!
కొండపైన రహస్య స్ధావంరంలో బందీలను ఎలా విడిపించాలా అన్న విషయంపై పెద్దలు అందరితో సమావేశమయ్యాడు శివయ్య. అక్కడ బందీలు ఉన్నవారి గది ముందు కుర్చిలో కూర్చొని విలాసంగా కాళ్లు ఊపుకుంటూ సిగార్ (చుట్ట) కాలుస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ టైప్ రైటర్ ముందుకు కుర్చి జరుపుని యాష్ ట్రే (చుట్ట నుసి రాల్చుకునే గిన్నె) పై సిగార్ ఉంచి, టైప్ రైటర్ పై లెటర్ టైప్ చేయసాగాడు.
‘అయ్య’ అని చిటికిన వేలు చూపించాడు శివయ్య కొడుకు బోస్.
సబ్ ఇన్‌స్పెక్టర్ సైగ చెయడంతో బోస్‌ను గది లోనుండి వెలుపలకు తీసి తుపాకీ ఎక్కుపెట్టిన సిపాయి ‘పద’ అన్నాడు.
మెరుపు వేగంతో యాష్ ట్రే పై కాలుతున్న సిగార్‌ను చేతిలోనికి తీసుకుని తలుపుచాటున ఉన్న మందుగుండు పెట్టెల్లోని ఒక తూటా (గ్రేనెడ్) (కొండలు పగులకొట్టేది)ను చేతిలోనికి తీసుకుని సిగార్ నిప్పుకు వెలిగించి సబ్ ఇన్‌స్పెక్టర్ ఒడిలో పడేలావేసి, పెట్టేలోని మరి కొన్నింటికిని గుత్తిగా పట్టుకుని నిప్పంటించిన బోస్ ‘వందేమాతరం’ అని పెద్దగా నినదించాడు.
పెళ్లున శబ్దం చేస్తూ ఆ పూరిఇల్లు తునాతునకలైయింది. అందులోని వారంతా ఏం జరిగిందో తెలుసుకునే లోపే మరణించారు. అక్కడ ఒక ఇల్లు ఉండేది అనే ఆనవాలు కూడా లేకుండా పోయింది.
ఆ శబ్దానికి కొండలు పలుమార్లు ప్రతిధ్వనించాయి.
ఇక్కడ మనం ఈస్టిండియా – ప్రెంచ్ – బ్రిటీష్ వారి గురించి తెలుసుకోవాలి. వీరు వ్యాపారం పేరున మనదేశంలో కాలు మోపి కుతంత్రాలతో, విభజించు పాలించు తీరున మన రాజులలో అనైక్యత ఏర్పరిచి వారు పాలకులుగా మారారు.
ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు అందరూ హిందువులే. ‘కారన్ వాలీస్’ బెంగాల్లో పర్మినెంట్ సెటిల్‌మెంట్ ఏర్పరిచి జమీందార్లను ఏర్పరినపుడు వారిలో నూటికి తొంభైమంది హిందువులే.
1912లో ‘అజాద్ అల్ హిలాల్’ అనే పత్రికను మౌలానా అబ్దుల్ కలాం ప్రారంభించాడు.స్వాతంత్రం అనంతరం వీరు నెహ్రు మంత్రివర్గంలొ తొలి విద్యామంత్రిగా ఉన్నారు.
1916లో ముస్లింలీగ్ ఏర్పడింది. ఆగాఖాన్ దీని ప్రారంభకుడు. 1907లో ఆగాఖాన్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం బ్రిటీష్ పాలకులను కలుసుకుని ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరాడు. అందుకు బ్రిటీష్ పాలకులు అంగీకరించారు. హిందూ, ముస్లిం విభేదాలకు ఇది నాంది.
1573 నాటికే పోర్చుగీసువారు గోవాలో స్ధిరపడ్డారు.
మహారాష్ట్రులు కొందరు సముద్ర వ్యాపార ప్రాధాన్యత గుర్తించారు. నాటి పీష్వాలకాలంలో సువర్ణదుర్గం కేంద్రంగా ‘కానోజి ఆంగ్రే’ అనే మహారాష్ట్ర సేనాని ఒక నౌకాబలాన్ని నిర్మించి అరేబియా సముద్రములో అడుగు పెట్టాడు. అరబ్, పోర్చుగీసు సముద్ర బందిపోటులనుండి తమ తీరాన్ని రక్షించుకోవడమే లక్ష్యంగా వారు తలచారు. బొంబాయికి పదహారు మైళ్ల వరకు సముద్రప్రాంతంలో ప్రవేశించే ప్రతి నౌక నుండి, కానోజి ఆంగ్రే పన్ను వసూలు చేయసాగాడు. ఈ చర్య పోర్చుగీసు, బ్రిటీష్ వారికి ఇబ్బందిగా మారింది.
విజయనగర రాజులకాలంలో గోవా పోర్చుగీసు వారి వశమైయింది.
అసలు సముద్ర బలగం మొదట గుర్తించినది చోళరాజులు. పన్నెండవ శతాబ్ది వరకు పెద్ద నౌకా బలగాన్ని నిర్మించి బంగాళాఖాతం అంతా తాము పెత్తనం చేయసాగారు. అనంతరం శైలేంద్రరాజులకు చోళరాజులకు సముద్ర ఆధిపత్య కొరకు పోరాటాలు జరిగాయి. చోళరాజులు శైలేంద్ర రాజుల చేతిలో ఓడిపోయారు. భారత రాజకీయ కేంద్రం ఉత్తర హిందూస్తాన్‌కు మారడంతో, ఢిల్లీ నవాబులకు యావత్ భారత పాలకులు అన్నపేరు వచ్చింది.
ప్రపంచ పర్యటనకు బయలు దేరిన వాస్కోడిగామా 1498లో కేవ్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టి భారతదేశం చేరుకుని కాలికట్‌లో కాలు మోపాడు. ఆప్రికాను చుట్టిరావలసిన అవసరం వాస్కోడిగామాకు ఎందుకు వచ్చిదంటే, రోమన్ చక్రవర్తుల కాలంలో భారతదేశం నుండి అరేబియా సముద్రమార్గాన వ్యాపారం జరిగేది. అక్కడనుండి యూరప్‌కు, గ్రీకు, ఇటలీలకు భూమార్గాన సరుకులు వెళ్లేవి. క్రీ.శ. 7వ శతాబ్దిలో ఈజిప్టు ముస్లింల వశం కావడంతో, యూరప్‌కు ఎర్ర సముద్రం గుండా రాకపోకలు ఆగిపోయాయి.
యూరపియన్లు మరోమార్గం కనుగొనవలసి వచ్చింది. అలా వెదుకుతూ మొదటిసారి 1487లో ‘బార్తలోమి యోనోవె’ అనే పోర్చుగ్రీసు సాహస యాత్రికుడు గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టాడు. అదే దారిన వాస్కోడిడిగామా భారతదేశం చేరుకున్నాడు. అప్పుడు కాలికట్‌ను పాలిస్తున్న రాజు ‘జామెరిన్’ భారత తీర సముద్రానంతా తాను జయించి పోర్చుగ్రీసు చక్రవర్తికి పాదార్పితం చేస్తాను అన్న వాస్కోడిగామాను, జామెరిన్ కాలికట్ నుండి బహిష్కరించాడు. వాస్కోడిగామా కొచ్చిన్ రాజు ఆశ్రయం పొందాడు. అలా కాలికట్, కొచ్చిన్ రాజులు పరస్పరం కలహించుకుంటూన్న సమయంలో పాశ్చాత్య రాజ్యాలకు భారతదేశంలో ప్రవేశం కలిగించడానికి ఇదే నాంది.
(సశేషం)