[dropcap]”బు[/dropcap]ద్ద భగవానుని పూజించే వాళ్లంతా బౌద్ద మతానికి చేరిండే వాళ్లు కదనా”
“అవునురా”
“ఏసు ప్రభువుని మొక్కే వాళ్లంతా కిరస్తానము వాళ్లు కదనా”
“అవునురా”
“అల్లా మహ్మదుని కొలిచే వాళ్లంతా ఇస్లాం మతానికి చేరిండే వాళ్లు కదనా”
“అవునురా…. అవును”
“మడి బుద్ద భగవానునిది, ఏసు ప్రభువుది, అల్లా మహ్మదుల మతాలు ఏమినా?”
“వాళ్లకి మతం లేదురా, వాళ్లంతా మతాతీతంరా”
“వాళ్లకి లేనిది వీళ్ల కేమిటికినా?”
“ఏమిటికని వాళ్లనే అడగరా సామి, నా మతం పెద్దది నా గతం గొప్పది అని కొట్లాడి చస్తా వుండారు. ఉండే ఒగే ఒగ బదుకుని ఏమిటికి కాకుండా చేసుకొంటా వుండారు”
***
మడి = మరి