[dropcap]నా[/dropcap]కు నేను వేసుకునే ప్రశ్న
ఆడపిల్లగా పుట్టి
అక్క,చెల్లిగా
ఆలిగా, తల్లిగా
ఇదే
నేను అనుకున్న
లోకం
కాదు కాదు నేను భ్రమపడిన లోకం
అవును
చీరలో చూసి అమ్మ అన్న కొన్ని నోర్లు,
డ్రెస్సులో చూసి ఓహ్ వాహ్ అనే
ప్రశంసల సాకుతో
నా ఆడతనాన్ని కోరుకుంటూ,
తనువును తాకాలని
తహతహలాడుతుంటే.
నన్ను నేను వెతుక్కునే క్షణాలు
నా కళ్ళ ముందు నిలిచాయి.
అప్పుడే వేసుకున్నా
ఓ ప్రశ్న.
అమ్మతనం తగ్గిందా?
ఆడతనం కవ్వించిందా?
నాలో aనువ్వు వెతికేది ఏమిటి?
స్నేహమా
ప్రేమా
మోహమా
కామమా
ఎన్ని మెట్లు ఎక్కినా
ఆడది అంతేనా
కొందరు స్నేహం అని
కొందరు ప్రేమ అని
ఇంకొందరు మోహం అని
మరి కొందరు కామం అని
ఎవరేమన్న నాకు
ఒక సమాధానం మాత్రం దొరికింది.
అమ్మ పొత్తిళ్లలో
చీరచాటు వెచ్చదనంలో
కట్టుబాట్ల లోకం తెలియక
స్వేచ్ఛగా పడుకున్న పసిపాపలో
కూడా మృగాళ్లకు
నగ్నత్వమే కనిపిస్తుంది కానీ
మేము వాదించే నగ్నసత్యం కనిపించదని.