[dropcap]వా[/dropcap]డి మాట వేదవాక్కులా భావించాలంటాడు
వాడి అడుగుల్లో అడుగు వేసి నడవాలంటాడు
వాడికొక్కడికే హృదయమున్నట్లు ప్రవర్తిస్తాడు
సర్వజ్ఞుడిలా పరిపూర్ణ జ్ఞాన స్వరూపంలా ఆదేశాలిస్తుంటాడు
వాడి ఆజ్ఞలను పాటించకుంటే
గుండెల్లో బ్లో అవుట్‌లను సృష్టిస్తాడు
ఎదుటి మనిషికి రక్తమాంసాలుంటాయనీ
స్పందించే మనసు కూడా ఉంటుందనీ
వాడెప్పుడూ గుర్తించనట్లు నటిస్తాడు
గురివిందల్ని ప్రస్తావిస్తాడు
నల్లపూసై తిరుగుతాడు
నలుసులా సలుపుతుంటాడు
బాధలు బాధ్యతలూ నీ వంటాడు
సుఖ సంతోషాలలో ఓలలాడుతాడు
వాడు మగత్వానికి మచ్చుతునక!
నా వ్యక్తిత్వానికి మాయని మరక!