‘యె ఉన్ కా ప్రేం పత్ర్ పఢ్ కర్ – రఫీ ఒక ప్రేమ పత్రం’ – పుస్తక సమీక్ష-1

7
3

‘రఫీ ఒక ప్రేమ పత్రం’a అనే పుస్తకం తెలుగులో మహమ్మద్ రఫీ పైన రచయిత్రి మృణాళిని రాసిన పుస్తకం. తెలుగులో రఫీపైన ఒక పుస్తకం వస్తున్నదన్న వార్త ఆనందాన్ని కలిగించింది. భయాన్ని కలిగించింది. ఆనందం ఎందుకో చెప్పనవసరం లేదు. ఎందరో రఫీ అభిమానులు రఫీపై ప్రచురితమైన ప్రతి పుస్తకాన్ని, అక్షరాన్ని దాచుకునేవారున్నారు. రఫీ గురించి ఎంత విన్నా, ఎంత తెలుసుకున్నా, విన్నదే పదే పదే విన్నా, చదివినదే మళ్ళీ మళ్ళీ చదివినా, అతని పాటలాగే తనివితీరదు. కాబట్టి రఫీ గురించి మరో పుస్తకం, అదీ తెలుగులో రావటం ఆనందకరమైన విషయం. భయం ఎందుకంటే, హిందీ సినిమాలు, హిందీ పాటల గురించి తెలుగులో రాసేవారు అధికులలో ఒక రకమైన నిర్లక్ష్యం, అలసత్వం, అహంకారం కనిపిస్తుంది. పాఠకులను తేలికగా తీసుకుని చులకనగా చూడటం కనిపిస్తుంది. ‘ఏం రాసినా చదువుతారు’ అన్న అహంకారం కనిపిస్తుంది. దీనికి తోడు పుస్తకంలో ఏముందో చూడకుండానే, రచయితను చూసి పొగిడే ఒక స్థిరపడ్డ వ్యవస్థ ఉండటంతో ఈ అహంకారం సువ్యవస్థితమై ఉంది తెలుగులో.
‘వక్త్ నే కియా’ (కాగజ్ కే పూల్) పాట చిత్రీకరణలో కనిపించే కాంతిపుంజం కోసం స్టూడియో పై కప్పుకి రంధ్రం కొట్టారని ఒకాయన రాశాడు. గీతాదత్ పాట పాడగానే నూర్జహాన్, సురయ్య, షంషాద్ బేగం, లత వంటి వారు బెదిరిపోయారని ఇంకొకాయన రాశాడు. ’జహాతెరే పైరోంకె కమల్ గిరా కర్తెహై (మాచిస్) అంటే, ఎక్కడ నీ కమలల్లాంటి కాళ్ళు జారిపడతాయో’ అని ప్రేయసి కాళ్ళు జారిపడటంలోని ఆనందాన్ని అనుభవిస్తూ రాశాడింకొకాయన. ఒకడిని ప్రేమించి మరొకడిని పెళ్ళి చేసుకోగానే వాడే సర్వస్వం అనుకునే అమ్మాయిని అర్థం చేసుకునే బదులు , మానవ మనస్తత్వంతో పరిచయం లేకుండా , హేళన చేస్తూ రాస్తాడింకొకాయన. ఈ రకంగా అసలు విషయం అర్థం కాకుండానే, అధ్యయనం లేకుండా, ఊహకొచ్చిందంతా రాసేసి హిందీ సినిమాల స్పెషలిస్టులయిపోయే వీలుండటంతో తెలుగులో హిందీ సినిమాలు, పాటల గురించి ఇష్టమొచ్చిన రాతలు చలామణిలోకి వస్తున్నాయి. కాబట్టి ’రఫీ’ పై పుస్తకం వస్తోందంటే ఆనందంతో పాటు భయం కూడా కలిగింది. కానీ, పుస్తకం రాస్తున్నది “ఒక ఐ పాడ్ నానో, బుర్రలో కనీసం అయిదువేలపాటలుంటాయ”ని కితాబులందుకున్న రచయిత కాబట్టి కాస్త ధైర్యంగావుండవచ్చనుకున్నాను.
మృణాళిని రచించిన రఫీ ప్రేమ పత్రం చదివిన తరువాత నా భయం నిర్హేతుకం కాదని స్థిరపడింది. ‘ఒకరిపై అభిమానం ఉండటం వేరు. పుస్తకం రాయడం వేరు’ అన్న రచయిత్రి మాటలు అక్షరాలా సత్యం అని మరోసారి నిరూపితమైనది.
పుస్తకం ముఖచిత్రం అందంగా ఉంది. ‘రఫీ-ప్రేమపత్రం’ అన్న పేరు కూడా బాగుంది. కానీ పేరు చూసి ఇది రచయిత్రి వ్యక్తిగత భావనలను పొందుపరచుకున్న పుస్తకం అన్న అపోహ కలుగుతుంది. అలాంటిదేమీ లేదీ పుస్తకంలో. మహ్మమద్ రఫీ మరణించి నలభైఏళ్ళు దాటినా ఇంకా ఆయన స్వరం, ఆయన పాటలు సజీవంగా ఉంటూ తరాల అంతరాలను దాటి మెప్పిస్తూనే ఉన్నాయి. ఆయన గురించి బోలెడన్ని పుస్తకాలు వచ్చాయి. బోలెడన్ని రచనలు వచ్చాయి. వస్తున్నాయింకా. బోలెడన్ని బ్లాగులున్నాయి. వెబ్‍సైట్‍లున్నాయి. ఫేస్‍బుక్ పేజీలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రఫీ ఫ్యాన్స్ క్లబ్బులున్నాయి. కాబట్టి రఫీ గురించి సమాచారంలో లోపం లేదు. కానీ అది అందరికీ తెలిసినదే. పైగా రఫీ జీవితంలో రచయిత్రి చెప్పినట్టు ‘నాటకీయత స్వల్పం’. ఇలాంటి పరిస్థితులలో ఆయన గురించి పుస్తకం రాయటం అంటే కత్తిమీద సాము చేసినట్టే. అందరికీ తెలిసిన సమాచారమే అయినా ఆసక్తికరంగా చెప్పాల్సి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయాలనే ఆకర్షణీయంగా చూపాల్సి ఉంటుంది. పాత విషయాలలో కొత్తకోణాలు చూపించాల్సి ఉంటుంది. అంటే, చదివినదే మళ్ళీ చదువుతున్న పాఠకుడు కొత్త విషయాలను చదివిన అనుభూతికి లోనయ్యేటట్టు రచించాలి. కళ్ళెదురుగా ఉన్నదాన్నే కొత్తకోణంలో చూపించటం అన్నమాట. ఈ విషయంలో రచయిత్రి సంపూర్ణంగా విఫలమవటమే కాదు రచయిత్రి రఫీ పాటలను వింటారు తప్ప అనుభవించడం, అర్థం చేసుకోటం వంటివేవీ లేవన్న భావనను కలిగిస్తుంది. ఎక్కడా రచయిత్రి వ్యక్తిగత అభిప్రాయం, వ్యాఖ్యానం కనబడక ఇది కొన్ని పుస్తకాలను, వెబ్ సైట్లలోని అంశాలను యాంత్రికంగా చేసిన తర్జుమా, విషయాల సంకలనం అనిపిస్తుంది. అంటే ఆత్మలేని అక్షరాలను, ప్రేమ లేని ప్రేమ పత్రాన్ని మనముందుంచిన భావన కలుగుతుంది.
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ‘తెలుగులో రఫీ బయోగ్రఫీ లేదు’ అన్నారు ముందుమాటలో. ఇది కూడా రఫీ బయోగ్రఫీ కాదు. ఇందులో ఉన్న సమాచారాన్ని, జీవిత విశేషాలను సంక్షిప్తంగా ఇస్తూ , రఫీ పాడిన 25 పాటల అర్థాలు, వ్యాఖ్యానంతో 2006లో ‘పి.వి. సత్యనారాయణ రాజు’ ‘రఫీ పాటలు, అర్థాలు, సందర్భాలు’ అన్న పుస్తకం రాశారు. ‘హాసం ప్రచురణలు’ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ‘రఫీ – ప్రేమకథ’ కూడా ఆరంభంలో రఫీ జీవితాన్ని టూకీగా చెప్తుంది. తర్వాత కొందరు సంగీత దర్శకులతో అతని అనుబంధాన్ని వివరిస్తుంది. చివరలో కొన్ని పాటలను అనుబంధంలో వ్యాఖ్యానంతో ఇస్తుంది. సత్యనారాయణ రాజు రాసినప్పుడు అందుబాటులోలేని సమాచారాన్ని ‘సుజాతాదేవ్’ పుస్తకంలో పొందుపరచిన సమాచారాన్ని స్వేచ్చగా అనువదించి అందిస్తుంది.

ఈ పుస్తకం గురించి అభిప్రాయం చెప్పడం కష్టం. రఫీ గురించిన సమాచారం ఉంది. పాటలు ఉన్నాయి. ఫొటోలున్నాయి, గణాంక వివరాలున్నాయి. కానీ వాటిని కలిపి జీవంపోసే ‘ప్రాణం’ లేదు. ఆత్మ లేదు.

పుస్తకం గురించి ఏమయినా అభిప్రాయాన్ని చెప్పేకన్నాముందు పుస్తకంలో పొందుపరచిన పాటలలో దోషాల పట్టిక పరిశీలించాల్సి ఉంటుంది. ఒక పొరపాటయితే ‘ముద్రరాక్షసం’ అనుకోవచ్చు. కానీ పుస్తకమంతా కనిపిస్తుంటే బహుశా పుస్తక రచయితకు హిందీ, ఉర్దూల పదాల అర్థాలు, పాట అర్థం వంటి విషయాలపై అవగాహన లేదనిపిస్తుంది. ‘పాటలు వింటారు తప్ప భావం తెలియదు. అర్థం కాదు’ అన్న క్యాటగిరికీ రచయిత్రి చెందుతారనిపిస్తే దోషం పాఠకుడిది aకాదు. లేదా, దోషం ప్రూఫ్ లు సరిగా చూడనివారిది, సరయిన ఎడిటర్ అన్నవాడులేని తెలుగు ప్రచురణ వ్యవస్థదా? వినికిడిలో దోషాలను తెలుసుకోకుండా విన్నది వినిపించినట్టు రాసేశారు అనిపిస్తుంది.

పుస్తకంలో పాటలను రాసేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించలేదు.
పలుసందర్భాలలో జవాన్ ను జవా అనీ, జమీన్ ను జమీ అనీ రాశారు. ఇందువల్ల అర్ధం మారదు కానీ తప్పు. జాగ్రత్తగా వింటే జవాన్ అనటం, జమీన్ అనటం తెలుస్తుంది. అయితే, హసీన్ ను హసీ అని రాయటం పొరపాటు. హసీ అంటే నవ్వు. హసీన్ అంటే అందం, ఆకర్షణీయం, మనసు దోచుకునేది . హసీ అని వున్నచోటల్లా( పలుచోట్ల వుంది) హసీన్ గా చదువుకోవాలి.

  1. మహల్ ఉదాస్ ఔర్ గలియా సూనీ, ఛుప్ ఛుప్ హై వీరానే (page 13)
    మహల్ ఉదాస్ ఔర్ గలియా సూనీ, చుప్ చుప్ హై దీవారే………‘ఛుప్ కాదు చుప్. ‘ఛుప్’ అంటే దాక్కోవటం. ‘చుప్’ అంటే మౌనం,silence
    ‘వీరానే’ కాదు ‘దీవారే’
    వీరానా అంటే శూన్యం, ఎడారి, ఒంటరితనం
    దీవార్ అంటే గోడ
  2. పతంగ జల్ జల్ మర్ జాయె (page 16)
    ‘పతంగ’ అంటే దీపం పురుగు.
    ‘పతంగ్’ అంటే గాలిపటం.
    గాలిపటం కాలి చచ్చిపోవడంలో అర్థం లేదు.
    దీపం పురుగు ప్రియుడు. దీపం ప్రేయసి. ప్రియుడు ప్రేమాగ్నిలో పడి కాలిపోతాడు.
    ఇది ‘గాలిపటం’ పాటకాదు.
  3. సునో సునో ఐ దునియావాలో బాపూ జీ కీ అమర్ కహానీ (3౦)
    సునో సునో ఐ దునియావాలో బాపూ కీయే అమర్ కహానీ
  4. వతన్ కీ రాహ మే వతన్‌కీ నౌజవాన్ షహీద్ హో (31)
    వతన్‍కి రాహ మే వతన్‍కె నౌజవాన్ షహీద్‍హో
  5. మన్ తడ్‍పత్ హరిదర్శన్‍కో ఆజ్ (36)
    మన్ తరపత్ హరిదర్శన్‍కో ఆజ్, డ, ర ల ను ఒకదానికొకటి వాడటం ప్రాంతీయంగా అలవాటే, అనారి, అనాడి లాగా..కానీ ఇక్కడ తరపత్ అని ఉండాలి..లేకపోతే భావం చెడకున్నా రాగం చెడుతుంది.
  6. నైన్‍లడ్ గయీ హైరే (38)
    నైన్‍లడ్ జై హై (131వ పేజీలో నైన్ లడ్ జయి హయిరే అని దాదాపుగ సరిగ్గానే ఉంది ‘రే’ ని తీసేస్తే.)
  7. ఆజీకీ రాత్‍మేరే, ఆయీహై బహారే మీఠే (39)
    ఆజ్‍కీ రాత్‍మేరే, ఆయీహై బహారే మిటె,

మరో చోట మిట్టే అనీ వుంది.

మీఠే అంటే తీపి, మిటే అంటే నాశనమవటం, మరణించటం, ఓడిపోవటం

  1. ఐ దిల్ హై ముశ్కిల్ , ఆంఖోహి ఆంఖోమే ఇశారా హోగయా (43)
    ఐ దిల్‍హై ముష్కిల్, ఆంఖోహి ఆఖోమే ఇషారా
    (ఈ పుస్తకంలో ‘ష’ కి బదులు ‘శ’ వాడటం కనిపిస్తుంది. ‘శ్యాం’ అంటే కృష్ణుడు ‘శాం’ అంటే సాయంత్రం. అన్ని ఉదాహరణలు ఇచ్చే బదులు ఈ ఒక్క ఉదహరణ ఇస్తున్నాను.
  2. జవాని యాయె మస్త్ (43)
    జవాని హాయె మస్త్
  3. ముఝే యూ దేఖ్ కర్ (43)
    ఓ ముఝే దేఖ్ కర్
    ఇదే క్రింద పేరాలో సరిగ్గా రాశారు.
  4. ఏక్‍బార్ ముస్కరాదో (44)
    ఏక్‍బార్ ముస్కురాదో (సినిమాపేరు)
    ఈ ముస్కురాదో అన్న పదాన్ని ‘మస్కరాదో’ అనే రాశారు పుస్తకమంతా.
  5. యె తఖ్తో యె తాజో (46)
    యె మహలో, యెతఖ్తో యె తాజోంకి దునియా.
  6. చాంద్ సముఖ్‍డా క్యూ శర్‍మాయే(47)
    చాంద్ స ముఖ్‍డా క్యూ ర్‍మాయా
  7. కిస్కో సునావో కోయీ నహీహై ఆజ్ సమఝ్ నేవాలా (48)
    కిస్కో సునావూ కోయీ నహీహై ఆజ్ సమఝ్ నే వాలా
  8. కల్ కీ రూప్ మే చలీహో ధూప్ మే (49)
    నిన్నటి రూపంలో ఎండలో వెళ్తున్నావు అన్న అర్థం వస్తుంది.
    కలీ కీ రూప్ మే, చలీహో ధూప్ మే
    కలి అంటే మొగ్గ. మొగ్గలాంటి అమ్మాయి ఎండలో ఎటు వెళ్తున్నావు? అని అర్థం.
  9. మై జిందగీమే హర్ దమ్ రోతాహి రహూంగా (50)
    మై జిందగీ మె హర్‍దమ్ రోతాహీ రహాహూ
  10. ఆజ్ కల్ మె ఢల్ గయే (50)
    ఆజ్ కల్ మె ఢల్ గయా
  11. మాయూస్తహూవా (60)
    మాయూస్ తో హూవా
  12. యహా సే వహా తక్ జుదా హోగయామై (63)
    యహా తక్ కె ఉస్ సె జుదాహోగయామై
  13. ఏక్ షహన్ షాహనె దౌలత్ క సహారా లేకర్, హమ్ గరీబోంకి ఉడాయాహైమజా (63)
    ఏక్ షహన్ షాహనె దౌలత్ క సహారా లేకర్, హమ్ గరీబోంకి ఉడాయాహై మజాక్….మజా వేరు మజాక్ వేరు.
  14. తుమ్హీ దిల్‍సే చాహా (79)
    తుమ్హే దిల్‍సే చాహా
  15. ఆజాకె ఇంత్‍జార్‍మే (రాజ్‍హట్ చిత్రం) (89)
    ఆజాకె ఇంత్‍జార్‍మే (హలాకూ చిత్రం)
  16. చలేజా చలేజా చలేజా జహా ప్యార్ మిలా (94)
    చలేజా చలేజా చలేజా జహా ప్యార్ మిలే
  17. గాడీవాలే గాడీ గిరే (99)
    గాడివాలే గాడీ ధీరే హాక్ రే
  18. ఐదిల్ ఐముశ్కీల్ జీనాయహా (100)
    ఐదిల్ హై ముష్కిల్ జీనాయహా (143వ పేజీలో సరిగ్గ ఉంది)
  19. హమ్ కాలీహై తో క్యాహువా (106)
    హమ్ కాలేహై తో క్యాహువా
    ‘కాలీ’ అనటంతో లింగం మారిపోతుంది.
  20. శుధ్ బిసర్‍గయి ఆజ్ (107)
    సుధ బిసర్‍గయి ఆజ్
  21. నతో కార్‍వాకీ తలాశహై (107)
    న తో కార్‍వాన్ కీ తలాష్ హై
  22. పూఛోనకైసె మన్ రైన్ బితాయే (108)
    పూఛో న కైసె మైనె రైన్ బితాయే
  23. యూతో హమ్‍నే లాఖ్ హసీ దేఖీహై (117)
    యూన్‍తో హమ్‍నే లాఖ్ హసీన్ దేఖేహై
  24. బడీ హై దిల్‍కే కాలే (121)
    బడె హై దిల్‍కే కాలే.
  25. మెరే సీనేమెభి దిల్‍హై మై హూ అఖిర్‍ ఎక్ ఇన్‍సాన్ (122)
    మెరె సీనే మేభి దిల్‍హై , హై మేరేభి కుఛ్ అర్మాన్
    ముఝె పత్థర్ర్‍తో న సమ్‍ఝో
    , మైహు ఆఖిర్‍ ఎక్ ఇన్సాన్….. కనీసం మెరె సీనే…. మైహు ఆఖిర్‍ అంటే అర్థం అయ్యేది.
  26. రాహే మిల్ గయి రాహోమ్ (123)
    రాహీ మిల్ గయి రాహోమే
    రాహే అంటే దారులు. దారులు దారిలో కలిశాయి అన్న అర్థం వస్తుంది.
    ‘రాహీ’ అంటే ప్రయాణీకుడు. ప్రయాణీకుడు దారుల్లో కలిశాడు.
  27. ధడక్‍నె లగ్‍తాహై, మెరాదిల్ తెరే సామ్నే (123)
    ధడక్ నె లగ్తాహై మెరాదిల్ తెరే నామ్‍సే
  28. ఖన్ ఖన్ కె (125)
    ఖన్‍కెతో ఖన్‍కే క్యూఖన్ కే
  29. దిల్ ఉసే దోజోజా (125)
    దిల్ ఉసేదో, జో జాన్ (దేదే)……….జా అంటే పో అన్న అర్ధం వస్తుంది. జాన్ అంటే ప్రాణం
  30. జబ్ మెహబ్బత్ జవా హోతాహై (125)
    జబ్ మెహబ్బత్ జవాన్ హోతీహై (పాటలో వింటే ’జవా’ అనిపిస్తుంది. జాగ్రత్తగా వింటే రఫీ ‘జవాన్’ అనటం గమనించవచ్చు)
  31. ప్యార్‍సర్ద్ సర్ద్ హై (126)
    దిల్ దేకే దేఖోలో ఇదేం పాటో తెలియడం లేదు. ప్యార్‍కీ కసమ్ హై అన్న పాట ఉంది. రాత్ సర్ద్ సర్ద్ హై, చాంద్ జర్ద్ జర్ద్ హై అన్న పాట జాలినోట్ అనే సినిమాలోవుంది. ప్యార్‍సర్ద్ సర్ద్ హై, ప్యార్ కియా తో డర్నా క్యా సినిమాలో ఆశాభోస్లే, రఫీ పాడిన పాట.
  32. అజాకె ఇంత జార్‍మే – ప్రొఫెసర్ (126)లోది కాదు. ‘హలాకు’ సినిమాలోనిది. 89వ పేజీలో ఇదే పాట ‘రాజ్‍హట్’ సినిమాలోనిది అని ఉంది. ‘ప్రొఫెసర్’ లోది ‘ఆవాజ్ దేకే హమ్ తుమ్ బులావో’. రాజ్ హట్ సినిమాలో లతా రఫీ డ్యూయెట్ లేదు.
  33. దేఖ్ కసమ్‍సే (126)
    దేఖో కసమ్ సే.
    ఈ సరిచేయటంలో ‘కా’ ‘కీ’లకు అర్థం మారని పక్షంలో వదిలేశాను
  34. ఆయీహై బహారే మిట్టీ జుల్మొసితమ్ (132)
    ఆయీ హై బహారే మిటే జుల్మ్ – ఓ – సితమ్
  35. ఆజ్ పురానీ రాహోమే కోయీ ముఝే ఆవాజ్ నదే (132)
    ఆజ్‍పురానీ రాహాంసే కోయీ ముఝే ఆవజ్ నదే.
  36. దోఘడీ వో జొ పాస్ ఆ బైఠే, ప్రదీప్ కుమార్ పాట కాదు, భరత్ భూషణ్ పాట (133)
  37. జిందగీకె సఫర్‍మే అకేలేథే హమ్ పాట ’ఆజ్ ఔర్ కల్’ సినిమాలోది కాదు. ఇది నర్తకి సినిమాలోది.
  38. ఐవతన్ ఐవతన్ తుమ్ కొమేరీ కసమ్ (145)
    ఐవతన్ ఐవతన్ హమ్ కొ తేరీ కసమ్
  39. జుల్ఫోంకో హటాదో గాలోంసే (145)
    జుల్ఫోంకో హటాలే చెహరేసే……..గాల్ అంటే బుగ్గలు, చెహెరా అంటే ముఖము.
  40. పత్థర్ కే సనమ్ తఝే హమ్‍నే మెహబ్బత్ కా ఖుదా జానా (145)
    పత్థర్‍ కె సనమ్ తుఝే హమ్‍నే మెహబ్బత్ కా ఖుదా మానా
  41. కభీ కభీ ఐసేభీ కుఛ్, డర్ లగేతో గానా గా ఐసాభీ(145)
    కభీ కభీ ఐసాభీ కుఛ్, డర్ లగేతో గానా గా , వైసే భీ.
  42. తెర కాం హై జల్నా పర్వానా (147)
    తెర కాం హై జల్నా పర్వానే
  43. కుఛ్ తుమ్‍నే బద్‍నామ్ కియా కుఛ్ అగ్‍ లగీ లోగోనే (154)
    కుఛ్ తుమ్‍నే బద్‍నామ్ కియా కుఛ్ అగ్ లగాయీ లోగోనే
  44. మెహెరుబా లిఖూ (171)
  45. మెహెర్‍బాన్ లిఖూ
  46. కల్ జహా బస్తీ థి ఖూషియా (171)
    కల్ జహా బస్తీథి ఖుషియా
  47. ఆజ్‍కీ రాత్ యెకైసీ రాత్ కి హమ్‍కో నీంద్ నహీ ఆయీ (177)
    ఆజ్‍కీ రాత్ యె కైసీ రాత్ కె హమ్ కో నీంద్ నహీ ఆతి
    ఈ పాట ‘లవ్ ఇన్‍టోక్యో’ లోది కాదు. ‘అమన్’ సినిమాలోది.
  48. చలోరే డోలీ ఉఠావూ కహా (194)
    చలోరే డోలీ ఉఠావో, కహార్
    ‘కహా’ అంటే ‘ఎక్కడ’, ‘కహార్’ అంటే ‘బోయీలు, పల్లకి మోసేవారు, ‘డోలీ ఉఠావో కహార్’ అంటున్నాడు పాటలో.
    195వ పేజీనుండి 242వ పేజీ వరకూ ఫోటోలుండటంతో నా పని కాస్త సులువయింది. థాంక్స్
  49. నజారే అప్నిమస్తియా లుటా లుటాకే సోగయా (245)
    నజారే అప్ని మస్తియా లుటా లుటాకే సోగయే
  50. Although we came from different lands (246)
    Although we hail from different lands
  51. జుల్ఫేహై జైసె చాంద్ కె బాదల్ ఝకె హువే (247)
    జుల్ఫేహై జైసె కాంధోంపె బాదల్ ఝకే హువే
    వెంట్రుకలు చంద్రుడి మేఘాలు వొంగినట్టున్నాయన్నది తప్పు. కురులు ఎలా ఉన్నాయంటే భుజాలపై మేఘాలు వాలినట్టున్నాయి.
  52. ఘటామె జైసె ఛన్ రహీ (249)
    ఘటా సె జైసె ఛన్ రహీ
    తుమ్ కహో కాఫిర్ ఫిర్‍భీ హమ్ న ఝుకే
  53. తుమ్ కహో కాఫిర్ ఫిర్‍భీ హమ్ న ఝూకే, కదమ్ యె నాజ్ పె ఎక్ సజ్దా అదా హోజాయె (250)
    తుమ్ కహో కాఫిర్ ఫిర్‍భీ ఐసే ఝుకే
    కదమ్ – ఎ – నాజ్ పె ఎక్ సజ్దా అదా హోజాయె
    నువ్వు నన్ను కాఫిర్ అన్నా నేను నీ గర్వించే నాజూకైన పాదాలముందు మోకరిల్లుతాను. ‘సజ్దా’ అంటే వంగి చేసే నమస్కారం.
  54. ఖూబ్ సూరత్ సీ కొయీ హం సే ఖతా హోజాయే అంటే ‘అందమైన తప్పు చేయాలనిపిస్తుంది ‘కాదు’ అందమైన తప్పు నా వల్ల జరిగిపోతుందేమో, జరిగిపోవచ్చు’ అని అర్థం.
  55. దీవానా కహకే అప్ ముఝే (250)
    దీవానా కహకే ఆజ్ ముఝే
  56. తుమ్హారి జల్ఫ్ కీ సాయెమే (253)
    తుమ్హారి జల్ప్ కే సాయేమె
  57. భూల్ సక్తే నహీ (251), థక్ గయీహై (252)
    భూల్ సక్తీనహి, థక్ గయే హై
  58. అజ్‍కీ రాత్ బడీ శోక్ బడీ నట్ ఘట్ హై (255)
    ఆజ్‍కీ రాత్ బడీ షోఖ్ బడీ నట్ ఖట్ హై
  59. దేఖ్ వో ఛట్ పె (255)
    దేఖ్ వో ఛత్ పె
  60. యె బస్తీ హై ముర్దా పరస్తోంకి బస్తే (259)
    యె బస్తీ హై ముర్దా పరస్తోంకి బస్తీ
  61. కల్‍తో సబ్‍కీ కార్ వాధీ సాథ్ సాథ్ (263)
    కల్‍తో సబ్‍థే, కార్‍వాన్ కే సాథ్ సాథ్
  62. ఆశ్ నిరాశ్ కె రంగోంసె (265)
    ఆశ్ నిరాశ్ కె దో రంగోంసే
  63. పావ్ మె పడ్ గయే తాలే (265)
    పావోయే పడ్ గయె ఛాలే.
  64. నిర్మొహీ (267)
    వో నిర్మొహీ….
  65. బర్బాదియోంక శోక్ మనానా (268)
    బర్బాదియోంక సోగ్ మనానా
  66. గమ్ ఔర్ ఖుషీమె ఫర్కన మెహసూస (268)
    గమ్ ఔర్ ఖుషీమె ఫర్క్ న మహసూస్
  67. తుఝ్ కో కిసీ మఝబ్ (269)
    తుఝ్‍కో కిసీ మజ్‍హబ్
  68. కాటోంసే మధ్ రూహ్(269)
    కాటోం ఎ-వజ్-రూహ్
  69. ఉన్ కె లియె (269)…………తూ ఇన్ కె లియె
  70. యె నీల్ సె నీలీ అంఖే (272)
    య్ ఝీల్ సి నీలీ అంఖే
    ఝీల్ అంటే సరస్సు. సరస్సులో నీటి లాంటి నీలి కళ్ళు.
  71. ఇన్ కాయే జోర్ జూమ్ (273)
    ఇన్‍కా యే జోర్ జుల్మ్
  72. డోలక్ చమ్ చమ్ కామినీ (274)
    డోలత్ చమ్ చమ్ కామినీ
  73. దిల్ తోడ్ యె ఘటా (275)
    దిల్ తోడ్ యె ఘాతా
    ‘ఘటా’ అంటే మేఘం, ఘాత్ అంటే దెబ్బ
  74. ఐవెన్ దునియా దేవీ దుహాయా (276)
    ఐవెన్ దునియా దేవే దుహాయీ
  75. టేకి / టేకి (276)
    తేకి / తేకి
  76. ఐసేన ఆజ్‍మావో (277)
    న ఐసే ఆజ్‍మావో
  77. ముఝ్‍సే కోయీ ఖతా హోగయీ తో ఖతాకుఛ్ నహీహై (278)
    ముఝ్‍సే కోయీ ఖతా హోగయీ తో, ఇస్‍మే మేరీ ఖతాకుఛ్ నహీహై
  78. సబ్ కో క్యా క్య గుమా హోరయా హై (278)
    సబ్‍ కో క్యాక్యా గుమాన్ హోరహీ హై
  79. దాల్ కటానా ఆతీ ఛిడియా (279)
    దాల్ క దానా లాయీ చిడియా
  80. పీప్ రాకే పట్వా సరిఖా డోలె మన్‍వాకి(281)
    జియారేమె ఉఠ హట్ హిలోర్ (281)
    ప్రిప్రాకె పత్వా సరిఖా డోలె మన్‍వాకి
    జియరా మా ఉఠత్ హిలోర్
  81. ఇది క్షమించరాని నేరం. నిర్లక్ష్యమా? అజ్ఞానమా? అలసత్వమా? అర్థం కాదు.
    హరియో… హరియో… హరియో… (283)
    హరి ఓమ్…. హరి ఓమ్… హరి ఓమ్, అంటే హరి ఓం అంటూ ఆరంభిస్తాడని కూడా గ్రహించని రీతిలో పాట విన్నట్టా??
  82. మోరె తుమ్‍బిన్ బీగీరే సక్‍రే కాజ్ (283)
    మోరే తుమ్‍బిన్ బిగరే సగరె కాజ్
  83. అమర్ ఔర్ నజర్ (283)
    హమరీ ఓర్ నజర్
  84. సున్ మోరే వ్యాకుల్ మన్‍కా బాగ్ (283)
    సునో మోరె వ్యాకుల్ మన్ కా బాజ్
    మన్‍కా బాగ్ – మనస్సుతోట
    మన్‍కా బాజ్ – మనస్సు గీతం / స్వరం
  85. మరణశయ్యపై ఉన్న హరి భక్తుడు / చచ్చుబడిపోయిన కాళ్ళకు జీవం వచ్చి (283)
    హరిభక్తుడు మరణశయ్యపై లేడు / కాళ్ళు చచ్చుబడలేదు. హరిదాసుకు సంధివాత రోగం వల్ల కాళ్ళు కదపలేకపోతున్నాడు. పాటవల్ల కాళ్ళకు శక్తి వస్తుంది.
  86. సూనీ కదమ్ కీ ఠండీ ఛలియా (286)
  87. సూనీ కదమ్ కీ ఠండీ ఛయ్యా
  88. పాటమాత్రం నేపధ్యగీతం (287)
    ఇది నేపధ్యం పాట కాదు. ఒక సాధువు మెట్లుపై నిలబడతాడు. ఆరంభంలో ఒకేసారి లాంగ్ షాట్ లో కనబడతాడు. అందుకే అధికులు ఇది నేపధ్య గీతమని పొరబడతారు.
  89. షేక్ కా ధర్మ్ షేక్ కా ధరమ్ ఔర్ దినె బరహమన్ (288)
    షేక్ కా ధర్మ్ ఔర్ దీన్ – ఎ – బరహమన్
  90. సర్ హమారా కటే గీతో కుఛ్ గమ్ నహీ (291)
    కట్ గయే సర్ హమారే తో కుఛ్ గమ్ నహీ
  91. తెరమీద ఈ పాటను ధర్మేంద్ర ఆలపిస్తాడు. (291)
    ధర్మేంద్ర – ప్రియరాజ్ వంశీ చనిపోయిన తరువాత నేపథ్యంలో పాట ఆరంభమవుతుంది.
  92. చివరికి ధర్మేంద్ర కూడా ‘అబ్ తుమ్హారే హవాలే’ అంటూ మరణిస్తాడు (291)
    రామ! రామ!
  93. రక్షా హై యె చిరాగ్ (292)
    ర ఖ్ఖ హైయె చిరాగ్
  94. హమ్ లాయెహై తూఫాన్ సె కిశ్తీ నికాల్‍కే (292)
    హమ్ లాయెహై తూఫాన్‍సె కష్తీ నికాల్‍కే
    ‘కిష్తీ’ అన్నా ‘కష్తీ’ అన్నా అర్థం ఒక
  95. గమే హస్తీ సే (297)
    గమ్ -ఎ – హస్తీ సే
  96. కితనా హై బద్‍నసీబ్ (299)
    హై కితనా బద్‍నసీబ్
  97. కూయె – యాద్ మే (299)
    కూ – ఎ – యాద్‍మే
  98. ఆజ్ ఇస్ దరజ్ (301)
    ఆజ్ ఇస్ దర్జ
  99. వాస్నా సినిమాలోని ’ఆజ్ ఇస్ దర్జ పిలాదో’ పాట రాసింది మజ్రూహ్ సుల్తాన్ పురి కాదు. అతని పేరు మజ్రూహ్, మజ్రు కాదు. మజ్-రూహ్..రూహ్ అంటే ఆత్మ..ఆత్మగాయం. The wounded one. ఈ పాట రాసింది సాహిర్ లూధియాన్వీ.
  100. బాత్ చలత్ నై చునరీ రంగ్ లాతీ (303)
    బాట్ చలత్ నయీ చునరీ రంగ్ డారీ
  101. హై ఉసోహై బేదర్ద్ బన్‍వాన్ (303)
    హో ఐసో హై బేదర్దీ బన్‍వారీ
  102. నిడర్, దరత్ న కహూ సే లంగర్ / అప్నే ధింగా ధింగా (303)
    ఐసే నిడర్, , డరత్ న కాహూ సే లంగర్ / అప్నే ధింగా – థింగీ కరత్ హై డగర్
  103. ఇతనీ దినకమ్ మోసే కబహో నా అటకయో (303)
    ఇత్నే దినన్ మే మోసే కబహూ న అట్‍కాయో

సే / సీ / కే / కీ, వంటి వాటినీ, అర్థాలు మారని వాటినీ వదిలేయగా మిగిలినవి ఇవి. ఇదంతా చూస్తుంటే ఇది ప్రేమపత్రమా? పొరపాటుల సత్రమా? అనిపిస్తుంది. పాట వినటానికీ, అర్థం తెలుసుకోవటానికి తేడా ఉంది.

మహమ్మద్ రఫీ తనకు తెలియని భాష పదమయినా పలు మార్లు అడిగి తెలుసుకుని, అర్ధం, ఉచ్చారణ వంటి విషయాలను అభ్యసించి పాట పాడేవాడు. ఏమాత్రం అనుమానం వచ్చినా మళ్ళీ టేక్ అనేవాడు. అలాంటి వ్యక్తి గురించి రాసిన పుస్తకంలో ఇన్ని అచ్చు తప్పులు క్షమించరాని నేరం. అలాంటి వ్యక్తిపై ప్రేమతో రాసిన పుస్తకం ఇలావుండటం శోచనీయం.
రఫీ అంటేనే పాట. అలాంటప్పుడు పాటల్లోనే ఇన్ని దోషాలా? దీనికి ఎవరు జవాబుదారి? రచయితనా? ప్రచురణకర్తనా?

ఇదే రఫీ కి ప్రేమ పత్రం అయితే….యె ఉన్ కా ప్రేం పత్ర్ పఢ్ కర్ , కె తుం నారాజ్ న హోనా….( ఆమె ప్రేమ పత్రం చదివి నువ్వు ఆగ్రహించద్దు) అని పాడాలనిపిస్తుంది…
వచ్చే వ్యాసంలో పాటలుకాక ఇతర పొరపాట్లు..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here