శ్రీపర్వతం-47

0
3

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 47వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-3.1

[dropcap]వెం[/dropcap]టవస్తున్న రాజోద్యోగి శ్రమణుడి మీద ఛత్రం పట్టుకున్నాడు. రాజసభ నుండి విశ్రాంతి మందిరానికి తిరిగి వస్తున్న శ్రమణుడు, గాలి వేగంగా వీచడం చేత వాన జల్లులలో బాగా తడిసిపోయాడు.

విశ్రాంతిగృహం చేరగానే శ్రమణుడు రాజోద్యోగితో అన్నాడు.

“నిన్నటి దినం ఆషాఢ పూర్ణిమ – నేడు ప్రతిపత్తు. భగవానుడు చెప్పిన ప్రకారం బౌద్ధ భిక్షువులు ఈ నాడు వస్సావాసం ప్రవేశించాలి. దయదలచి మహారాజులు నన్నొక విహారానికి పంపితే, సంఘవాసులతో ఈ వర్షర్తువు మూడు నెలలు గడుపుతాను. మహారాజు గారికి ఈ వార్త చెప్పి, వారి అనుమతితో నన్నొక సంఘారామానికి తోడ్కొని పోవలసింది.”

రాజోద్యోగి వెనువెంటనే రాజమందిరానికి పరుగులు తీశాడు. మహారాజు తమ గురువులు సంఘమిత్రల నిర్దేశం ప్రకారం ఈ విధంగా కబురు పంపారు.

“ఆనందా! వస్సావాసానికి మా అతిథి గృహం కన్న ఉత్తమమైన వసతి లేదు. నువ్వు నిర్విచారంగా నీ కార్యక్రమం అక్కడ నెరవేర్చుకోవచ్చు.”

శ్రమణుడు రాజోద్యోగి సమక్షంలో, కళింగ భూపతికి ఎదురుగా నిలబడి పలికాడు.

“నేను నేటి నుండి మూడు మాసాలవరకు వస్సావాసం ప్రవేశిస్తున్నాను”.

“నేను నేటి నుండి మూడు మాసాలవరకు వస్సావాసం ప్రవేశిస్తున్నాను”.

“నేను నేటి నుండి మూడు మాసాలవరకు వస్సావాసం ప్రవేశిస్తున్నాను”.

మూడుసార్లు వారి ఎదుట శ్రమణుడు ఈ విధంగా పలికి పిమ్మట అభ్యంతర మందిరం ప్రవేశించాడు. కళింగ భూపతి, రాజోద్యోగి తమతమ గృహాలకు వెళ్లిపోయారు.

శ్రమణుడు మధ్యాహ్న భోజనం ముగించాడు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొన్నాడు. అప్పుడప్పుడు వర్షం వెలిసినా, ఆకాశం మేఘాలతో కప్పబడి వర్షం తిరిగి పడుతునే ఉంది.

కళింగభూపతి తిరిగి అతిథి గృహానికి వచ్చేసరికి వర్షం పడుతునే ఉంది. ముందుగదిలో శ్రమణుడు పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. భూపతి కూడ అతనికి సమీపంలో రత్నకంబళం మీద ఆసీనుడయాడు. ఇద్దరూ కొంత సేపు మౌనంగా ఉన్నతరువాత కళింగ భూపతి సంభాషణ ప్రారంభించాడు.

“ఓ ఆనంద భిక్షూ! నేనీ వస్సావాసం గురించి విన్నాను. బౌద్ధ భిక్షువులు వర్షాకాలం మూడు నెలలు దేశ సంచారం మాని, ఒక విహారంలో స్థిరంగా ఉండి ధర్మం గురించి చర్చిస్తారని విన్నాను. కాని వివరాలు తెలియవు. ఒక భిక్షువు సంఘమవుతాడా? వర్షాకాలంలో శ్రమణులు ఎందుకు ప్రయాణాలు చేయరు? ఎవరీ పద్ధతిని ప్రవేశపెట్టారు? దీనికి సంబందించిన ఆసక్తికరమైన విషయాలను చెప్పవలసింది.”

శ్రమణుడు చెప్పడం మొదలు పెట్టాడు.

బుద్ధ భగవానుడు అపుడు రాజగృహంలో, వేలువనంలో, కలందక నివాసంలో ఉండేవాడు. ఆనాటికి భగవానుడు వస్సావాసం బౌద్ధ భిక్షువులకై నిర్దేశించలేదు. అందుచేత భిక్షువులు చలికాలంలోను, ఎండాకాలంలోను, వర్షాకాలంలోను తమ సంచారం యథాతథంగా చేస్తూ ఉండేవారు.

బౌద్ధ భిక్షువుల సంచారం చూసి జనులు ఏవగించుకున్నారు. ఒకరి చెవిలో ఒకరు మాట్లాడుకున్నారు. వాళ్ళ మీద కోపగించి అన్నారు. ‘శాక్యపులీయులైన సమణులు చలికాలంలో, ఎండాకాలంలో, వర్షాకాలంలో ఒకే విధంగా ఏల సంచరించుతున్నారు? ఆకుపచ్చని మొక్కలను, మూలికలను పాదాల కింద తొక్కి వేస్తున్నారు. అల్పమైన ప్రాణులను నాశనం చేస్తున్నారు. తిత్తీయవర్గాలకు చెందిన వారు చేసే ధర్మబోధలు ఉత్తమమైనవి కావు. అయినప్పటికి వారు వర్షాకాలంలో విరామం అవలంబించి, ఆ కాలం భద్రంగా గడపడానికి వసతులు ఏర్పాటు చేసుకుంటారే! వృక్ష శాఖల చివరలను గూళ్లు నిర్మించుకున్న పక్షులు, వర్షాకాలంలో ఎక్కడికి పోకుండా ఉండడానికి వసతులును ఏర్పాటు చేసుకుంటాయే! శాక్య పుత్తీయ సమణులు ఇందుకు భిన్నంగా అన్ని ఋతువులలోను సంచరిస్తూ, వర్షాకాలంలో పచ్చటి మొక్కలను, మూలికలను, అల్పప్రాణులను నాశనం చేయడం భావ్యంగా లేదు.

జనులాడే ఆమాటలను కొంతమంది భిక్షువులు విని, బుద్ధ భగవానుడికి ఈ విషయం నివేదించారు.

అపుడు భగవానుడు ముందుగా ధర్మబోధ చేసి, భిక్షువులను ఉద్దేశించి పలికాడు.

‘ఓ భిక్షువులారా! మీరు వస్సాన్ని (ఆవాసాన్ని) ప్రవేశించవలసిందని నేను అదేశిస్తున్నాను.”

ఆవిధంగా వస్సావాసం ఆచరణకు వచ్చింది.

ఆనాటి నుండి బౌద్ధ భిక్షువులు అవిచ్ఛిన్నంగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

కళింగభూపతి అంతా విని ఒక ప్రశ్న వేశాడు.

“శ్రమణా! మీరు చెప్పినట్లు, ఆషాఢ పూర్ణిమ వెళ్లిన మరునాడు వర్షావాసం ప్రవేశించాలి. ఆ దినం నాడు వాసం ప్రవేశించకపోతే నియమం తప్పినట్లే అవుతుంది. కారణాంతరాల వల్ల ఆనాడు ప్రవేశించకపోయినవారు, అటు పిమ్మట మరే దినాన్ని ప్రవేశించవచ్చు?” ,

“ఒకసారి మగధ రాజైన నేనియ బింబిసారుడు, మొదటి తరుణం నాడు కాకుండా, అటుపిమ్మట వచ్చే పూర్ణిమనాడు పూజ్యులు వస్సావాసం ప్రవేశింప వీలవుతుందా?” అంటూ భిక్షువులకు సందేశం పంపించాడు. వారీ సంగతి భగవానుడికి తెలిపారు. ‘ఓ భిక్షువులారా! మీరు రాజులకు విధేయులుగా ఉండవలసింది’. అంటూ మహాత్ములు సమన్వయించారు. ఆవిధంగా ఆషాఢపూర్ణిమ మరునాడు కాని, శ్రావణ పూర్ణిమ మరునాడు కాని వస్సావాసం ప్రవేశించవచ్చు”.

“ఒకసారి వస్సావాసం ప్రవేశించిన భిక్షువులు మూడు నెలల కాలం ఒకచోటనే గడపాలా?”

“ఒకసారి వస్సావాసం ప్రవేశించిన తరువాత ఛబ్బగ్గీయ భిక్షువులు తమ ప్రయాణాలను యథాతథంగా చేశారు. జనులు ఏవగించుకున్నారు. కోపం తెచ్చుకున్నారు. మధ్యే మార్గం అవలంబింస్తున్న కొందరు భిక్షువులు జనుల విమర్శ విని బుద్ధ భగవానుడికి చెప్పారు. భగవానుడు ధర్మోపదేశం చేసి, మొదటి తరుణంలో కాని, రెండవ తరుణంలో కాని ప్రవేశించిన భిక్షువు లెవరూ ప్రయాణాలకు పోరాదని ఆదేశించారు”.

“ఈ ఆదేశాన్ని ఎవరూ విరోధించలేదా?”

“కొంతమంది ఛబ్బగ్గీయ సమణులు వస్సావాసం ప్రవేశించడానికి అంగీకరించలేదు. ఈ సంగతి తెలుసుకున్న భగవానుడు, అట్టి నిరాకరణ దుఃఖతానేరం కింద పరిగణింపబడుతుందని అన్నారు.”

“ప్రత్యేకమైన పరిస్థితులలో కూడా వస్సావాసం విడువకూడదా?”

“ఒకసారి భగవానుడు రాజగృహంలో తాను కోరినంత కాలం గడిపి పిమ్మట శావత్థికి వెళ్లినారు. శ్రావత్థిలో భగవానుడు అనాథ పిండీకుని జేతవనంలో వసించారు. ఆ సమయంలో ఉదేనుడన్న ఉపాసకుడు దేశంలో సంఘం కోసం ఒక విహారాన్ని నిర్మించాడు. అతడు భిక్షువులకై ఈ విధంగా సందేశం పంపించాడు.

“పూజ్యులు ఇక్కడికి రావలసింది. సంఘానికి బహుమతిలిచ్చి, ధమ్మం వినగోరుతున్నాను. భిక్షువులను చూడాలని ఉంది.”

“మిత్రుడా! మొదటి తరుణంలో కాని, రెండవ తరుణంలో కాని వస్సావాసం ప్రవేశించిన భిక్షువు లెవరు కూడా, మూడు మాసాలలో, ప్రయాణం చేయకూడదని భగవానుడు ఆదేశించారు. భిక్షువులు వస్సావాసం పూర్తిచేసేవరకు ఉదేనుడు వేచియుండవలసింది. వస్సావాసం తరువాత వాళ్లు అక్కడికి రాగలరు. తొందరగా కార్యం నిర్వహించవలసింది. వస్సావాసం తరువాత వాళ్లు అక్కడికి రాగలరు. తొందరగా కార్యం నిర్వహించవలసి ఉంటే, ఉపాసకుడు, ఆ ప్రాంతాలలో ఉండే భిక్షువుల సమక్షంలో విహారాన్ని సంఘానికి అంకితం చేయవచ్చు.”

“ఉపాసక ఉదేనుడు కోపగించుకున్నాడు. అతడు ఈ విధంగా పలికాడు.”

“నేను పిలవబంపినపుడు వారేల రాడానికి నిరాకరించారు? నేను దాతను. మంచి పనులు చేస్తున్న వాడిని. సంఘంలోని వారికి సేవ జేస్తున్నాను.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here