[dropcap]అ[/dropcap]క్షరాలన్ని ఏరుకుని
పదాలుగా కూర్చుకుని
వాక్యాలుగా అల్లుకుని
సాహితీ మాలలు
తయారు చేస్తుంటాను
స్వేద బిందువులతో
పగలంతా తడిసిన
కార్మికుడిని సత్కరించడానికి
దారపుపోగులను ప్రోగుచేసి
రంగులన్ని రంగరించి
అదమైన అంచులతో
నిండైన శాలువాలు
సిద్థం చేస్తుంటాను
మట్టి రేణువులతో
రోజంతా అలసిన
కర్షకుడిని సన్మానించడానికి
అవి వారికి చేర్చినప్పుడు
నా కలం రాల్చిన
ఆనంద భాష్పాలు
అవే కదా ఈ కవి
హృదయానికి
నిజమైన నీరాజనాలు