‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-4

3
3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

సందిగ్ధం   

[dropcap]బ[/dropcap]హుశ నిన్ను మరిచిపోవాలి
సరిగ్గా నేనిప్పుడు చేయాల్సిన పని అదే

నా మదిలోంచి నిన్ను చేరిపివేయాలని అనుకున్నా
నేనెట్లా మరిచిపోగలను

నువ్వు కేవలం ‘కల’వు కాదు
నువ్వు నిజం కదా

ఈ దౌర్భాగ్యపు హృదయం గురించి
ఏమని చెప్పను

అసలు ఉనికే లేని ఆ సత్సంభందాన్ని
నా హృదయం ఎప్పటికీ మరిచిపోలేక పోతున్నది

ఎప్పుడూ వ్యక్తం చేయని
ఆ ఒక్క ఆలోచన
నీతో ఎప్పుడూ చెప్పలేని
ఆ ఒక్కమాట
నీకూ నాకూ మధ్య
ఎప్పుడూ ఏర్పడని ఆ అనుబంధం

నాకన్నీ జ్ఞాపకమే
ఎప్పుడూ జరగని
ఆ విషయాలన్నీ నాకు జ్ఞాపకమే

మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here