[box type=’note’ fontsize=’16’] భారత స్వాతంత్ర్యపోరాటం గురించి, పలు వైజ్ఞానికాంశాల గురించి నేటి బాలబాలికలకు ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[dropcap]1[/dropcap]909లో రవింద్రనాధ్ ఠాగూర్ రాసిన ‘గీతాంజలి’ కావ్యానికి 1913లో ‘నోబుల్’ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన తొలి ఆసియా వాసి ఠాగూర్ వారే.
1910లో ప్రెస్ ఆక్టు సవరణ చట్టం జారీ అయింది. 1911లో ప్రజా ఉద్యమం ద్వారా బెంగాల్ విభజన రద్దు అయింది. 1913లో నాటి కాంగ్రెసు అధ్యక్షుడు గోపాలకృష్ణ గోఖలే మరణించారు. 1914-1918మధ్యకాలంలో మెదటి ప్రపంచయుద్ధం మెదలయింది.
1915 గాంధీజి స్వాతంత్ర్య పోరాటంలో ప్రవేశము. 1916లో పింగళివెంకయ్యగారు రూపొందించిన త్రివర్ణ పతాకం లక్నోలో ఎగురవేయబడింది. బాలలు ఇప్పుడు మనం వందేమాతరం కథ తెలుసుకుందాం!.
***
పోరాటం మనిషి సహజలక్షణం. భారతదేశం రత్న గర్బ, సిరి సంపదలకు పుట్టినిల్లు. అందుకే విదేశీయులు మనదేశంపై కన్నువేసారు.
గవర్నర్ ఆదేశాల మేరకు స్వయంగా గుంటూరు నుండి సైనికులతో బయలుదేరిన కలెక్టర్ రెండు రోజులు ప్రయాణ అనంతరం, పాలెం వెళ్లే దారిలో అడవి బాటన ముత్యాలమ్మ చెరువు వద్ద నీరు సమృధ్ధిగా ఉండటంతో ‘ఈ రాత్రి ఇక్కడ ఆగుదాం విశ్రాంతికి, భోజనాలకు ఏర్పాట్లు చేయండి’ అన్నాడు కలెక్టర్ తన గుర్రం దిగుతూ.
గుడారాలు అధికారులకు ఏర్పాట్లు చేయబడ్డాయి. వంట ప్రయత్నాలు మొదలయ్యాయి. సైనికులు ప్రయాణ బడలికతో అలసి ఎక్కడివారు అక్కడే చెట్లమోదట్లో కూర్చుండి పోయారు.
ఆవు నిరంతరం ‘అంబా’ అని అరవసాగింది. హెచ్చరిక సూచన అందుకున్న శివయ్య మనుషులు, ముత్యాలమ్మ చెరువు ప్రాంతాన్ని దూరంగా చుట్టు ముట్టి దాడి చేయడానికి సిధ్ధంగా ఉన్నరు.
శివయ్య ధనస్సునుండి మండుతూ వచ్చిన ఓక బాణం ఎండుగడ్డి ఉన్న ప్రదేశంలో గుచ్చుకుంది. వెనువెంటనే పదుల సంఖ్యలో మండుతున్నబాణాలు, ముత్యాలమ్మ చెరువు చుట్టూ ఉన్న ప్రాంతంలోని ఎండుగడ్డిపై గుండ్రంగా నాటుకున్నాయి.
అడుగు భాగాన ఎండుకట్టెలు, పైభాగాన కందికట్టె, ఆపై భాగాన ఎండుగడ్డి దానిపైన నూనె, కిరసనాయులు, కర్పూరము, చల్లి ఉండటంతో క్షణాలలో అడవి అంతా అగ్నిగుండంగా మారింది. ఎటుచూసినా అగ్నిజ్వాలలు ఎగిసి పతున్న సమయంలో, శివయ్య సైనికులకు చేరువగా వచ్చి చెట్టు చాటునుండి కొన్ని తూటాలు మంటల్లోకి విసరసాగాడు.
తూటాల పేలుళ్లకు, మంటలకు బెదిరిన గుర్రాలు పారిపోయ్యాయి. ఒక గుర్రంపై కలెక్టర్, అతని వెనుక గుర్రాలపై మరి కొందరు సైనికులు తప్పించుకు పారిపోతుండగా, ధనస్సుతో దారికాచిన శివయ్య ‘కలెక్టర్ భయపడక, శత్రువులు అయినా నిరాయుధులను మేము ఏమి చేయము. రెండు రోజులు ప్రయాణంలో అలసి వచ్చావు, ఆకలితో ఉన్ననీకు మేము తినే జొన్నరొట్టెలకు తేనే నేయి పూసి ఇస్తున్నా తిని వెళ్లు, నీపై ఉన్న గవర్నర్‌కి మా ఆశయ పోరాటం న్యాయమైనది అని చెప్పు వెళ్లు’ అని సైగ చేయడంతో, రొట్టెలు పెట్టి ఉన్న అరటి ఆకు మూటను అందించాడు కలెక్టర్ పక్కన ఉన్న సిపాయికి చంద్రయ్య.
వందేమాతరం అని దిక్కులు ప్రతిధ్వనించేలా నినాదం చేస్తూ అడవిలో కనుమరుగయ్యాడు శివయ్య తనవారితో. అడవిలో అగ్నిజ్వాలల్లో చిక్కుకున్న మిగిలిన సైనికులు, మందుగుండు సామాగ్రి, వాహనాలు, చిక్కుకుని బూడిదగా మారాయి.
నా బిడ్డలను పొట్టన పెట్టుకున్న తెల్లమూకలకు తగిన శాస్తి జరిగింది అనుకుంది సుగుణమ్మ.
మరో పర్యాయం ఆంగ్లేయుల దాడిని ఎలా ఎదుర్కోవాలో అని తనవారితో సమావేశమై, ఆలోచించసాగాడు శివయ్య.
బాలలు ఇక్కడ భారత దేశ గత చరిత్ర గురించి తెలుసుకొండి!
***
1916 అనీబీసెంట్ తెలుగు నాట చేసిన ఉపన్యాసాలు స్వాతంత్రోద్యామానికి బలమైన పునాదులు వేసాయి.
1919లో కిలాఫత్ ఉద్యమం జరిగింది. 1919లో యుద్ధం ముగిసింది. అదే సంవత్సరం మార్చిలో ప్రభుత్వం ‘రౌలత్’ చట్టాన్ని ప్రయోగించింది. 1919 అమృత్‌సర్‌లో ‘జలియన్‌వాలాబాగ్’ సభలో ప్రజలపై డయ్యర్ తన సైనికులతో కాల్పులు జరపగా, నాలుగువందలమంది మరణించగా, రెండువేలమంది గాయపడ్డారు.
1920లో గాంధీజీతో విభేదించిన అనీబీసెంట్ కాంగ్రెసు నుండి తప్పుకున్నారు. 1920 ఆగస్టు ఓకటవ తేదిన బాలగంగాధర్ తిలక్ మరణించారు. 1920లో గాంధీజి సహాయ నిరాకరణోద్యమాన్నిప్రారంభించి 1922లో అరెస్టు అయ్యారు. ఆరేళ్లశిక్ష విధింపబడింది. అనారోగ్యంతో ముందుగా విడుదలచేసారు.
1921లో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటి స్ధాపించారు. 1926లో అజాద్ వంటి మిత్రులను కలుపుకున్న భగత్ సింగ్ ‘నౌజవాన్ భారత సంఘము’ స్ధాపించాడు. 1928లో సైమన్ కమీషన్ ఎదిరించి లాహోర్‌లో లాలా లజపతిరాయ్ లాఠీ దెబ్బలు తిని, అదే సంవత్సరం నవంబర్ 17 మరణించారు.
లజపతిరాయ్ మరణంపై ప్రతికార చర్యగా, స్కాట్ దొర అనుకుని స్కాండర్స్‌ని షూట్ చేసి,తప్పించుకుని 1929 కేంద్ర శాసనశభలో బాంబు దాడిచేసిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురువు 1931 మార్చి 23న ఉరి తీయబడ్డారు.
1930 ఏప్రెల్ 6న ఉప్పుసత్యాగ్రహానికి గాంధీజి పిలుపునిచ్చారు. 1936లో నెహ్రు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపిక అయ్యరు. 1937 రెండో ప్రపంచ యుధ్ధ ఆరంభం. 1940 గాంధీజీ వ్యక్తి సత్యాగ్రహం.
1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభం అయింది. మరుదినం గాంధీజీ అరెస్టు. 1945 జూన్ 15న విడుదల చేయబడ్డారు. 1943 అక్టోబర్ 21 న సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ‘అజాద్ హింద్ పౌజ్’ను సింగపూర్ లో స్ధాపించారు. 1946 భారతదేశం అంతటా నిరసన ప్రదర్మనలు ప్రారంభం అయ్యాయి.
తెలుగు నేలపై జరిగిన స్వేచ్ఛా, స్వాతంత్ర్యపోరాటంలో పత్రికల పాత్ర గురించి తెలుసుకుందాం!
***
1848 ఏప్రిల్ 16న జన్మించిన కందుకూరు వీరేశలింగం, ప్రముఖ సంఘసేవకుడు, సంస్కరణవేత్త, వితంతు వివాహాలు చేయించారు. స్త్రీ విద్యా వికాసానికి విశేష కృషి చేసారు. 1874 అక్టోబర్‌లో “వివేకవర్ధిని”మాసపత్రిక ప్రారంభించి, దీన్ని 1876 దీన్ని పక్షపత్రికగా, అనంతరం వారపత్రికగా మార్చారు. దీనికి అనుబంధంగా “హాస్యసంజీవిని” 1890 అది ఆగిపోయింది. 1883 మహిళలకోసం “సత్యహితబోధిని”, 1891″సత్యసంవర్ధిని” అనే పత్రికను, 1905 “సత్రసంవాదిని” వంటి పత్రికలు నడిపారు.
1842 మే 14 న జన్మించిన “ఆంధ్రభాషాసంజీవిని” పత్రికను ఇరవై రెండేళ్లు నడిపారు. నాటి మద్రాసులో తెలుగువారు నడిపిన తొలి తెలుగు పత్రిక ఇది. 1893 ఆగస్టు 29న జన్మించిన గిడుగు వెంకటరామమూర్తి “ది టీచర్” అనే పత్రికను నడుపుతూ వ్యవహార భాషావ్యాప్తికి విశేషంగా కృషిచేసారు.
ముట్నూరి కృష్ణారావు “కృష్ణపత్రిక” “ఆంధ్రభారతి” పత్రికలు నిర్వహించారు.
1880 నవంబర్ 24 న జన్మించారు భోగరాజు పట్టాభిసీతారామయ్య. వీరు తొలుత “కృష్ణపత్రిక” 1919లో “జన్మభూమి” అనే ఆంగ్లపత్రిక, 1938లో “స్టేట్ పీపుల్ “అనే మాసపత్రికను, 1949లో “ఇండియన్ రిపబ్లిక్” అనే ఆంగ్ల దినపత్రికను మద్రాసులో నెలకొల్పారు.
1857 జనవరి 14 న జన్మించిన న్యాయపతి సుబ్బారావు 1919లో “చింతామణి”అనే మాసపత్రిక, “ఇండియన్ ప్రోగ్రెస్” అనే వారపత్రిక నిర్వహించారు.
శ్రీపాదకృష్ణమూర్తిగారు 1907లో “గౌతమి” దినపత్రిక, “వజ్రాయుధం”, “కళావతి” మాసపత్రికలు, 1898 అనంతరం “మానవసేవ”, “వందేమాతరం” పత్రికలు నెలకొల్పారు.
1883 సెప్టెంబరు 14న జన్మించిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు తొలి రాజకీయ ఖైదీగా గుర్తించబడ్డారు. దత్తమండలాలకు “రాయలసీమ” పేరు పెట్టిందికూడా వీరే. “స్వరాజ్య” పత్రిక సంపాదకుడిగా, 1914 ఏప్రిల్ 1న మద్రాసులో ప్రారంభించిన “ఆంధ్రపత్రిక” సంపాదకునిగా, 1919లో “నేషనలిస్టు” ఆంగ్ల వారపత్రిక, మహిళా పత్రిక “సౌదర్యవళ్లి” మెదలగు పన్నెండు పత్రికలు నిర్వహించారు.
కాశీనాధుని నాగేశ్వరరావు”ఆంధ్రపత్రిక”, “భారతి” పత్రికలుస్ధాపించారు. ఒద్దిరాజు రాఘవరావు తెలంగాణాలో తొలి “తెనుగుపత్రిక”ను1922 ప్రారంభించారు. 1924లో సబ్నవీసు వెంకట రామ నరసింహారావు “నీలగిరి”, “సంస్కారిణి” పత్రికలు నిర్వహించారు.
1896 మే28న జన్మించిన సురవరం ప్రతాపరెడ్డిగారు “గోలకొండ”, “ప్రజావాణి”అనే పత్రికలద్వారా విశేష సేవలు అందించారు. 1872 ఆగస్టు 23న జన్మించిన ప్రకాశం పంతులుగారు 1921లో “స్వరాజ్యం”, అనంతరం”విలేజ్ రిపబ్లిక్”, “గ్రామస్వరాజ్యం” పత్రికలను ఇంగ్లీషు, తమిళ, తెలుగు భాషలలో నిర్వహించారు.
1899 మార్చి 20న జన్మించిన మద్దూరి అన్నపూర్ణయ్య 1922 మార్చి 22న “కాంగ్రెసు”, 1937 డిసెంబర్ 15న “నవశక్తి”, 1947 ఆగస్టు15న “జయభారత్”, 1953 జూలై 10న “వెలుగు” అనే వారపత్రికలు ప్రారంభించారు. 1923లో తమిళనాట ‘పెరియర్ రామస్వామి “అరసు” (ప్రజారాజ్యం) అనే పత్రిక ప్రచురించారు.
1898 సెప్టెంబర్ 27న జన్మించిన కుందూరు ఈశ్వరదత్ “ట్వంటియత్” మాసపత్రిక, “వీక్ ఎండ్”, “న్యూఇండియా” పత్రికలు నిర్వహించారు. న్యాయపతి నారాయణమూర్తి”జైభారత్”వారపత్రికను స్ధాపించారు.
1895 అక్టోబర్ 8న జన్మించిన అడవి బాపిరాజు 1915లో “అభినవాంధ్ర సాహిత్యం”పత్రిక స్ధాపించారు. నెల్లూరు వెంకట్రామనాయుడు 1930లో “జమీన్ రైతు” పత్రిక స్ధాపించారు. 1904 లో పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ “సావిత్రి” పత్రికను స్ధాపించారు. వేముగంటి పాపాయమ్మ కాకినాడనుండి”హిందూసుందరి”అనే పత్రికను స్ధాపించారు.
1909 జూలై 15న జన్మించిన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ 1944లో “ఆంధ్రమహిళ” పత్రికను స్ధాపించారు.
తమిళుడైన సాధువరదరాజన్ “దక్షణ ఆంధ్రపత్రిక” తెలుగులో స్ధాపించారు. ఇలా వందలాది తెలుగు పత్రికల ద్వారా తెలుగుభాషా, విద్యా, కళలు, సంస్కృతి, దేశభక్తిని పెంపొందించడంలో తమ పాత్ర సమర్థవంతంగా నిర్వహించాయి.
బాలలు ఇప్పుడు మనం వందేమాతరం కథలోనికి వెళదాం!
(సశేషం)