[dropcap]ఎ[/dropcap]గిరే గాలిపటం నా జీవితం
మజిలీ లేదు
గమ్యం లేదు
అటూ ఇటూ ఊగుతూ
గాలి పలకరిస్తే ఒకవైపు
గాలి ధిక్కరిస్తే మరోవైపు
వర్షానికి గురైతే గభాల్న తుళ్ళి
ప్రేమొస్తే మళ్ళీ ఉవ్వెత్తున యెగిరి
గంతులేసే అల్పసంతోషి నా జీవితం
ఎగురుతూ పడిన కష్టాలని
పడని సంతోషాలని మోసుకుని
తెలియని ఆశాపాశం వైపు
నా పయనం
దారబంధం గట్టిదైతే
పయనం సులభం గమ్యం తథ్యం
కథ కంచికి నేనింటికి
దారం మధ్యలో తెగితే
ఏటిగట్టున కథలు, గుసగుసలు
నేను ప్రతి ఇంటికీ !