బాసట

8
2

[dropcap]ఆ[/dropcap]పదల్లో విలవిలలాడే
అభాగ్యులకు ఇచ్చే
ధైర్యమే బాసట.
నీకు నేనున్నా
అనే బావన కల్పించేది-
ఒంటరివాడిని
ఒడ్డుకు చేర్చే-
నావలాంటిదీ బాసట!!

ఆదుకునే నాథుడులేక-
నా అన్నవారు దూరమై-
జీవితానికి
చరమగీతం పాడిన అభాగ్యులందరూ
బాసట కరువైన వారే.
పైసా ఖర్చు చేయకున్నా,
పైన చెయ్యేసి-
అక్కున చేర్చుకునే –
మానసిక ధైర్యమే కదా బాసట??

బంధాలకు దూరమై,
అనుబంధమే మృగ్యమైన
అల్లాడే బ్రతుకులకు-
బాసట ఒక- అమృతభాండం .
అది ఒక ఆపన్నహస్తం!!

సహాయానికి
మారుపేరు-
సహృదయతకు
పట్టంకట్టే మంచితనం
దయార్ధ గుణంతో
ఫరిడవిల్లే మరో సుగుణం
ఈ బాసట!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here