సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.
***
పుస్తకం చదువుతున్న సుజాత అలివేలు మాటలు విని ఉగ్రరూపం దాల్చింది.
“ఏమిటే నువ్వు మాట్లాడేది? అసలు మీ అందరికీ బుద్ధి ఉందా అని!… అసలు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను మాత్రం మీరు ఊహించిన వ్యక్తి లాంటి దాన్ని కాను. ప్రేమ, మనసు ఒకరితో, వివాహం వేరొకరితో చేసుకోవడానికి నేను పుట్టింది భరతగడ్డ మీద. నేను సంస్కార హీనురాలిని కాదు. నిజం చెప్పాలంటే మీలా లేనిపోని మాటలు మాట్లాడే మూర్ఖురాలిని కాదు. మీరు నోరు నొప్పి పుట్టే దాక అనుకుంటే అనుకోండి. అది మీ ఖర్మ!” అని నుదురు మీదకు దోబూచులాడుతున్న శిరోజాలను చెవి వెనక్కి పెట్టి క్లిప్ పెట్టి వెనుతిరగబోయింది.
***
పెద్దలు ఎన్ని ఆటంకాలు కల్పించినా, వారిని ఒప్పించి – తమ ప్రేమను పండించుకున్న ఓ జంట కథని ధారావాహికగా చదవండి వచ్చే వారం నుంచి.