చలపాక వీరాచారి స్మారక పోస్ట్‌కార్డ్ కథల పోటీ ఫలితాలు ప్రకటన

0
5

[dropcap]‘ర[/dropcap]మ్యభారతి’ సాహిత్య త్రై మాసపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ద్వితీయ ‘చలపాక వీరాచారి స్మారక’ పోస్ట్‌కార్డ్ కథల పోటీలకు మొత్తం 224 కథలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో ప్రాథమిక పరిశీలనలో 71 కథలు సాధారణ ప్రచురణకు అర్హం కాగా, 42 కథలు పోటీకి అర్హత సాధించాయి. వాటిని మరింత వడపోయగా 11 కథలు పోటీకి నిలిచాయి. వాటిలో చలపాక కుటుంబం ఈ క్రింది వాటిని బహుమతులుగా నిర్ణయించాయి.

  • ప్రథమ బహుమతి రూ.1000/- పొందిన కథ

దేవుడు – నన్ద త్రినాధరావు, విశాఖపట్నం

  • ద్వితీయ బహుమతి రూ.500/- పొందిన కథ

తృప్తి- శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు

  • తృతీయ బహుమతి 300/- పొందిన కథ

ఇక్కడి లెక్క ఇక్కడే – ఎమ్.ఆర్.వి.సత్యనారాయణమూర్తి, పెనుగొండ

మరో 8 కథలకి 100/- చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందుకున్నవి

  1. శవం-శివం – శ్రీమతి కోపూరి పుష్పాదేవి, విజయవాడ
  2. ఆత్మశాంతి – కె.వి.లక్ష్మణరావు, మానేపల్లి
  3. కర్మయోగి – సి.హెచ్.వి.ఎస్.ఎస్. పుల్లంరాజు, విజయవాడ
  4. అమ్మ మనసు – బిక్కునూరి రాజేశ్వర్, నిర్మల్
  5. అమ్మ ప్రేమ – అలేఖ్య రవికాంతి, హైదరాబాద్
  6. సమస్య – జీడిగుండ నరసింహమూర్తి, బెంగుళూరు
  7. జ్ఞానం – దేశరాజు, ఉప్పల్
  8. గంజి – శీరం నారాయణస్వామి, సికిందరాబాద్

విజేతలకు నగదు బహుమతులతో పాటు, ప్రశంసాపత్రాలు పోస్ట్‌లో పంపబడతాయి. పోటీలు విజయవంతం అయ్యేందుకు నహకరించిన వత్రికల వారికి కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాము.

చలపాక ప్రకాష్- సంపాదకుడు – రమ్యభారతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here