[dropcap]”రే[/dropcap]య్! గుల్లిగా నువ్వు ఏ జాతికి చేరిండే వాడో నీకి తెలుసారా” అంటా అన్న నన్ని అడిగె.
“నేను ‘బలిజ’ నా” అంట్ని.
“నువ్వు రా మల్లిగా”
“నేను రెడ్డి నా”
“నువ్వు రా గడ్డమోడా”
“నేను ముస్లీం నా”
“నువ్వు పా సామి!”
“నేను సామి కాదునా, పాస్టర్‍ని. కిరస్తానము వాణ్ణి నా”
“ఆహా! ఏమి చెప్పితిరిరా… మీ జాతులకినా జూటి కొట్టా” అని మమ్మల్ని తిట్టేశా అన్న.
మాకి రేగిపోయ.
“ఎట్లా మాటంటివినా మమ్మల్ని” అంటూ అంద్రు అన్నపైకి జగడాలకి పోతిమి.
కాని అన్న దిగులు పడలే.
“రేయ్! తక్కువ బుద్ధి నాయళ్లారా, జాతి పేరులా ఆ కాలమునింకా ఈ కాలము వరకు జగడాలు ఆడింది సాల్దా? ఇబుడు నా పైనకి వస్తారా. నిజము తెలుసుకొండ్రా” అనే.
“ఏమా నిజము” అంటిమి.
“బూలోకములా వుండే మనుషులందరిది ఒకే జాతిరా. ఇంగా చెప్పలంటే మనమంతా పాలిచ్చే జంతువుల జాతికి చేరిండే వాళ్ళమురా” అని పాయ అన్న.
***
జగడాలు = గొడవలు