సరిగ పదమని-11

0
3

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

ని పాటా
సార్థకతకు బాట
జీవన సాఫల్యతకు
ఊతమిచ్చే ఆట

స్వేదం చిందించు
మోదం ఆవిష్కరించు!

~ ~

వాడు అసలు కూర్చోడు
పని లేని విరామంతో
పని లేదంటాడు –
సెలవుకే వాడొక సెలవు!

పరిగెత్తే కాలాన్ని
నిద్రపొమ్మంటే పోతుందా?

~ ~

దేముడు చెప్పినా
రాముడు చెప్పినా
ఆరుద్ర చెప్పినా
ఆది రుద్రుడు చెప్పినా

మానవుడే మహనీయుడు!
అతగాడే మాననీయుడు!

~ ~

చెబుతున్నా వినండి –
‘నా తట్టా – నా బుట్టా
నా చెంబూ – నా మతం
నా కులం – నా గోత్రం’

లోకులను స్థానిక
గుంజకు కట్టే రోతల్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here