ఇట్లు కరోనా-19

0
3

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

19

[dropcap]నా[/dropcap]కు ఒక కల వచ్చింది తెలుసా, నరమాంస భక్షకి అసలు నువ్వు నిద్ర అన్నది పోయావా అని నువ్వు అనుకుంటున్నావ్ కదూ.. నిజంగానే నేనొక బంగారు కలగన్నాను.  మీ రాష్ట్రంలోని బాన్స్‌వాడకు దగ్గర్లోని ఓ గ్రామంలోకి.. ఆ గ్రామం పేరు రైతు నగర్.  అక్కడి ప్రజలు గొప్ప ఆరోగ్య అవగాహనతో ఉన్నారు.  అయినా నేను చెప్పడం ఎందుకు, నేను వ్రాసిన ఆ కథను మీరే చదవండి. 

2021 మార్చి 18వ తేది.

టీవీల్లో డిబెట్స్.. పత్రికల్లో విశ్లేషణలు.. వాట్సప్ వడపోతలు.. ఇన్స్టాగ్రాంలో ఫొటోల వెల్లువలు.. రచ్చబండ కబుర్లతో పోటాపోటీగా కరోనా వార్తలు తన కన్నా వేగంగా ప్రయాణిస్తున్న వేళ..

Facebookలో ఓ రిపోర్టర్ పెట్టిన Post వైరస్ కన్నా వేగంగా వైరల్ అయ్యింది. అంతర్జాతీయంగా మానవ సమాజాన్ని ఓ కుదుపు కుదిపింది. భారత ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ల వరద వచ్చి పడింది. రాష్ట్రం ఒక్కసారిగా ప్రపంచ పటంలో వెలుగొందిపోయింది.

అపర కుబేరులు.. అపార మేధావులు.. అత్యంత గొప్ప పాలకులు గూగులమ్మ చెప్పందే నమ్మలేని జబ్బుని పెంచుకున్న బడాబాబులందరూ..  రాష్ట్రంలోని ఈ పల్లె గురించే గూగుల్లో సెర్చ్ చేశారు. ఒక్క విశేషమూ కన్పించలా.. ఏమిటిది అని తలపట్టుకున్నారు. కానీ విన్పిస్తున్న వార్తలు స్ఫూర్తిదాయకంగా వున్నాయి.

ఈ దోబూచులాట ఆపేద్దామంటూ అంతర్జాతీయ వార్తాహరులు ఆ ఊరికి దారి కట్టారు. మౌనం తప్ప మాటలు దొరకలా వారికి. చివరికి ప్రధాని గారు ముఖ్యమంత్రి గార్లు మాట్లాడితే తప్ప లైన్ క్లియర్ కాలా..

అసలు ఈ రహస్యం ప్రపంచానికి తెలిసేదే కాకపోవచ్చు. ఓ పత్రిక ప్రతినిధికి కరోనా పాజిటివ్ రావటంతో రాష్ర్టాలు, జిల్లాలు, పల్లెల వారీగా కోలుకున్న వారి జాబితా తయారు చేసే పనిలో పడ్డాడు. ప్రతి గ్రామంలో ఒకరో ఇద్దరో దొరికారు తప్ప ఈ ఊరిలో మరణాలు కానీ కరోనా సోకి తెప్పరిల్లిన వారి జాబితా కానీ దొరకలా.. పొరపాటు పడ్డాననుకుని మళ్ళీ మళ్ళీ దినపత్రికలు సహా వెతికినా ఆ గ్రామం పేరు ఎక్కడా కన్పించలా.. స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, పొంగు లాంటివి కూడా ఆ ఊరి పొలిమేరలు దాటిపోయిన దాఖలాలు లేవని స్థానిక రిపోర్టర్ చెప్పడంతో మరింత ఆసక్తిగా పరిశోధన ప్రారంభించాడు ఆ పత్రికా ప్రతినిధి. పుట్టిన బిడ్డ కూడా సెల్ చేతుల్లో పెట్టందే ఏడుపు ఆపని ఈ రోజుల్లో ఆ ఊరి వార్తలు కానీ, ఇంటర్నెట్లో ఆ ఊరి యువత విశేషాలు కానీ దొరకకపోవటంతో తానే ఆ ఊరి దారిపట్టాడు. తాండాలాంటి ఆ చిన్న ఊరు పుట్టి 10 యేండ్లు గడిచింది. ఆ పక్కనున్న పెద్ద పల్లె నుండి వేరుగా విడిపోయి ఓకే నిర్మాణంలో కూనపెంకులుగా 300 ఇండ్లు విశాలంగా చక్కటి పెరటితో కట్టుకోవడమే విస్మయానికి గురిచేసింది.

అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యం ఆ ఊరి యువత ఏ రంగంలోనైనా మొదటిస్థానంలో నిలబడటం.. ఓ 20 మంది డాక్టర్లను దేశంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిన చరిత్ర వారిది. దాదాపుగా సగం మంది కుటుంబాల్లోని పిల్లలు పెద్ద పెద్ద ర్యాంకుల్లో వున్నారు. తవ్వుతున్న కొద్దీ ఆ ఊరి గొప్పతనం ఊరుతూనే వుంది.. ఇంటర్వ్యూ చేద్దామంటే విముఖత  ప్రదర్శించారు ఆ ఊరి జనాలు.. చిత్రంగా అన్పించి చుట్టుపక్కల ఊరి వారిని వాకబు చేస్తే గత 4,5 సంవత్సరాలుగా ఆ ఊరి నుండి జబ్బుపడ్డ వారు లేనేలేరని చెప్పటం విస్మయం కల్గించింది.

మొత్తానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా కదిలితే తప్ప జవాబు ఇవ్వలేదు ఆ ఊరి జనాలు.. ఇదిగో ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ మీడియా సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఆ ఊరిలోకి అడుగుపెట్టారు.

ఎక్కడ చూసినా పచ్చదనమే. విశాలమైన రోడ్లు, రోడ్లకి ఇరువైపులా మూసివేయబడ్డ డ్రైనేజీ.. దారికి ఇరువైపులా వేప, బాదం, జామ, మామిడి, నిమ్మ చెట్లు వరుసగా.. ఊర్లో ఇళ్ళన్నీ ఒకే మాదిరిగా వున్నాయి. మట్టిలో కట్టబడి పైన కూనపెంకులు వేసి మధ్యలో ఆకాశాన్ని చూస్తూ.. మండువా లోగిలి ఇల్లుగా..

మధ్యలో అడ్డు తగిలానని కోప్పడకు.  పల్లెలంటే నీకు లాగే నాకూ ఇష్టమే.  మీ ముఖ్యమంత్రిగారొచ్చి ఆ పల్లె రహస్యాన్ని తెల్సుకుంటారా..తెల్సుకోరా..నువ్వు చెప్పు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here