మేరే దిల్ మె ఆజ్ క్యా హై-2

1
3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box] 

ఈ భూమి ఇంత అందంగా ఎందుకుంది?

[dropcap]ఒ[/dropcap]కటి అడగాలని ఉంది.,
లేదా ప్రశ్నించాలనీ ఉంది
అసలు.,
ఈ భూమి ఇంత అందంగా.,
జీవితం మీద ఆశ అమాంతంగా
పెరిగిపోయేంతగా ఎందుకు అలంకరించబడింది?
ఎవరి కోసం?

మరి., వాళ్ళ ముఖాల్ని అధ్ధంలో చూపానో లేదో.,
వాళ్లంతా అధ్ధం ముందు
తమ కొత్త ప్రతిబింబాలని చూస్తూ.,
అలిగి కూర్చుండి పోయారు.

ఈ లోకంలో శత్రువులతో పైపైన కలిసిపోవచ్చు.,
కానీ కడకు మిత్రులే కదా హృదయాశ్రయం ఇచ్చేది?

ఈ భూమ్మీద కొద్ది మంది జీవితపు అదృష్టాన్ని ఏమని చెప్పాలి..,?
అనగనగా ఒక సీత ఉండేది సుమా., చెప్పాలంటే.,
ఎంత మంచిదని.. ఈ భూమి అంత సహన శీలి ఆ సీత.,!
మరి.,
ఆమె ఎంత కష్టాలపాలు చేయ బడిందో కదా.,?

ఈ భూమి మీద జాతి., జాతంతా
యుగాలుగా ., కొద్ది పాటి కారుణ్యం కోసం నిరీక్షిస్తూ
ఉండడం పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన విషయం కానే కాదు సుమా.,!

నేనేమీ అవతార పురుషుణ్ణి కాను.,
ప్రవక్తను అంతకన్నా కాను
మరి నాకు ఈ అందమైన భూమిని వ్యాఖ్యానించేంత
గౌరవం ఎందుకు ఇవ్వబడిందో అర్థమే కాదు.

జీవితమంతా వనవాసంలో
గడిపేసాక.,
సిలువ మీద నాకు మృత్యువు దొరికిందని మీకు ఎలా చెప్పను?
ఇన్ని కష్టాలు.,కన్నీళ్లు ఉండగా కూడా.,
అసలు ఈ భూమి ఇంత అందంగా అలంకరించబడి.,
నాకు జీవితం మీద
అమాంతంగా ఆశ పెరిగి పోయేట్లు ఎందుకు కనపడాలి??

మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here