[dropcap]అ[/dropcap]మ్మ ఒక్కర్తేరా!
నువ్వు కసురుకున్నా కొసరి తినమనేది,
నువ్వు విసుక్కున్నా నీ వెంట ఉండేది,
నువ్వు దూషించినా నీకై దుఃఖించేది,
నువ్వు దగా చేసినా నిన్ను దీవించేది,
నువ్వు పలుకరించకున్నా నీకై పరితపించేది,
నువ్వు వేరు కాపురం పెట్టినా నీ వెన్ను నిమిరేది,
నువ్వు మరిచినా నిన్ను మరువనిది,
నువ్వు అరిచినా నిన్ను విడువనిది,
నువ్వు కన్నెర్ర చేసినా నీకై కన్నీళ్లు పెట్టేది,
అమ్మ ఒక్కర్తేరా!