‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
అంతర్జాలం
ఎంత ఆడినా
అంతర్జాతీయం
అవుతారా?
చెరగని రంగు!
~ ~
అడుగడుగునా
అందలాలు
అందవేమోనని
అంతు లేని బెంగ
లేకుంటే చెడుగుడు!
~ ~
విలువలు నేర్పరు
తెలుగు జిలుగు కాదంటారు!
కార్పొరేటు బడులు
వారికి గుడులు
తీరు బేజారు!
~ ~
ఆకాశానికి, నేలకు
థాంక్స్ చెప్పడం
సృష్టికి సాష్టాంగ
నమస్కారం చేయడం
అక్షరాలు చాలవు