[dropcap]”ఉ[/dropcap]సురు ఎవరి సొత్తునా?”
“ఎవరి ఉసురు రా”
“నీ ఉసురు, నా ఉసురు, ఇట్ల అందరి ఉసురు నా”
“ఓ అట్లనా”
“ఊనా”
“నీ ఉసురు నీ సొత్తు, నా ఉసురు నా సొత్తు, అట్లే అందరిది కూడా రా”
“ఎందాగంటనా?”
“ఉండేగంటరా”
“ఆమీట”
“ఏమీలేదు రా”
“అదేమినా అట్లనిస్తివి”
“ఇంగెట్లనాలరా”
“ఈ దేహమనే ఊరిలా దూరిన ఉసురు బూమి పైన పారాడి, గూరాడి, కడగ ఇంగో దేహములా దూరుతుందట కదా”
“నిజమేరా! కాని అదీ ఆయ కద”
“అదేడాయ, అదెబుడాయ, నాకి సూపీయినా”
“ఆడ పారాడతా వుండే నీ కొడుకు, కూతుర్ని చూడ్రారే”
“ఓ అవును కదా” అంటా నోరు తెరిస్తిని.
***
ఉసురు = ప్రాణం