[dropcap]”రా[/dropcap]ముడు, కిష్ణుడు, ఏసు వీళ్ళంతా దేవుళ్ళు కదానా”
“అవునురా”
“మడి చూసేకి మనుషులు మాద్రిగానే వుండారు”
“రేయ్! మనిషే దేవుడని దాని అర్థమురా”
“ఓ అదా… అసలు సమాచారము. అది తెలుసుకొనేకి వగ లేకుండా దేవుడా దేవుడా అని దేశమంతా పారాడతా వుంటాడు కదనా మనిషి”
“పారాడని లేరా, పారాడకుండా వుండేకి వీడేమి పర్వతమా”
“పర్వతము కాదు కాని అదేమో పరతత్వము అంటనే దాని కోసరము కూడా గూరాడత వుంటాడునా”
“ఈ పారాడేది, గూరాడేది పక్కలా పెట్టి (విడిచిపెట్టి) తనకి అన్నీ ఇచ్చిన ప్రకృతికి ‘తనని తాను’ అంకితం చేస్తే ఈ తోలు తిత్తిని వాడు గెలిచినట్టే, పరతత్వం పొందినట్లేరా”
“ఓ… అవునా… నా”
“అవునురా”
***
పారాడు = నడు