[dropcap]తె[/dropcap]నుగు తల్లీ, కళల కల్పవల్లీ
సకల సంస్కృతుల పాలవెల్లీ
నుతియింతుము నిను ప్రణమిల్లి ॥తెనుగు॥
నిను పాలించిరి శౌర్యధనులెందరో
నిను కీర్తించిరి ఘన కవులెందరో
ఇట జనియించిరి మహాత్ములెందరో
ఆయత ధర్మమూర్తులు ఎందరో ॥తెనుగు॥
భువనానికి భుక్తి పెట్టే మాతవు
కవనానికి శక్తినిచ్చే దాతవు
జీవనదులకు ఆవాసం నీవు
భారతావనికే ఆభరణం నీవు ॥తెనుగు॥
నీ కీర్తి భాసుర జ్యోతులు
నిఖిల దిక్తటములు నిండగా
నీ యశోదీప్తి చంద్రికలు
దశ దిశాంతములు వ్యాపింపగా ॥తెనుగు॥