[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మణిమయమైన పీఠిక. (6) |
4. ఔరంగజేబు చిన్నక్క. (4) |
7. పంట ముందరి జంట పదం (2) |
8. శిలాజములో నక్కిన పేలాలు (2) |
9. ఏనుగుకు, దోమకు ఉన్నంత తేడా (7) |
11. కలిసికట్టుగా (3) |
13. ఈ రేడు గాంధారి కుమారుడు. (5) |
14. రాజాస్థానములోని నాట్యకత్తె (5) |
15. సవ్యంగాలేని పండితుడు (3) |
18. తిరగబడ్డ రక్తనాళాలు (4,3) |
19. భారత్ పాక్‌ల సరిహద్దు గ్రామం. (2) |
21. విరామ చిహ్నం.(2) |
22. నగణం, ఆరు జగణాలు, వగణంతో ఒక వృత్తపద్యం. (4) |
23. 19వ శతాబ్దపు చివరలో మద్రాసు నుండి వెలువడిన ఆధ్యాత్మిక మాసపత్రిక. (3,3) |
నిలువు:
1. బిచ్చము (4) |
2. నూట ఇరవై తులాలు (2) |
3. నిష్ఠుర వచనం. (5) |
5. ఈ కాలువ నీలా ఉండదు. (2) |
6. పెద్దబీర (6) |
9. హెచ్చయిన ఆనందములు (7) |
10. సి.వి.కనకాంబరంగారు శీర్షాసనం వేశారు. (7) |
11. నేను చేస్తా చేస్తా అంటున్న పురూరవ చక్రవర్తి (3) |
12. రాజబాబుగారిలో ప్రేమను వెదకండి.(3) |
13. ఇదో టైపు పెళ్ళి (3,3) |
16. బరువులు మోసే ఎద్దు. (5) |
17. కంపాస్ బాక్సులో ఉండేది. (4) |
20. లేత గడ్డి (2) |
21. కాల్పనిక జగత్తులో గుంటూరు జిల్లా గ్రామం.(2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఫిబ్రవరి 2 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 90 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఫిబ్రవరి 07 తేదీన వెలువడతాయి.
పదసంచిక-88 జవాబులు:
అడ్డం:
1.తెలుపునలుపు 4.తీగెటపా/తంతిటపా 7.లబ్ధం 8.వేప 9.నవరసకందాయం 11.అముదు 13.వెంకటేశము 14.ముదిరినది 15.రముడు 18.సాయికృష్ణయాచేంద్ర 19.సీత 21.బాకా 22.తహఖానా 23.శ్రీరంగనీతులు
నిలువు:
1.తెలకలు 2.లుబ్ధం 3.పులసరము 5.టవే 6.పాపయ్యవడ్డాది 9.నవలంటేఅలుసా 10.యండమూరివీరేంద్ర 11.అముర 12.దుముడు 13.వెండితెరసీత 16.మువష్ణవైశ్రీ 17.పానకాలు 20.తహ 21.బాతు
పదసంచిక-88కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అబ్బయ్యగారి వకుళ దుర్గాప్రసాదరావు
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- భాగవతుల కృష్ణారావు
- బయన కన్యాకుమారి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కరణం శివానందరావు
- కరణం శివానంద పూర్ణానందరావు
- జానకి సుభద్ర పెయ్యేటి
- తాతిరాజు జగం
- మధుసూదనరావు తల్లాప్రగడ
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పరమేశ్వరుని కృప
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శివార్చకుల రాఘవేంద్రరావు
- శివానందరావు శ్రీనివాసరావు
- శిష్ట్లా అనిత
- శ్రీహరి శ్వేత శ్రీవాత్సవ
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- శ్రీనివాసరావు సొంసాళె
- వెంకాయమ్మ టి
- వర్ధని మాదిరాజు
- వరలక్ష్మి హరవే డాక్టర్
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.