మూలుగులు

8
3

[dropcap]”ఆ[/dropcap]వుకి, గొర్రెకి దేవుడంటే దిగులు, భయం, భక్తి వుందనా?”

“లేదురా”

“కుక్కకి, నక్కకి, పులికి, పందికి, పాముకినా”

“ఊహూ”

“కాకులకి, గువ్వలకి, నీళ్ళ జీవాలకి, పులుగా పుటురకినా (క్రిమి కీటకాలకి)”

“లేనే లేదురా”

“ఇన్ని జీవ జాతులకి లేనిది మనిషికి మాత్రమే ఎట్ల వచ్చెనా”

“బుద్ది నింకారా”

“బుద్ది నింకానా”

“అవునురా బుద్ది నింకానే. ఇది చేసిన పనికి మనిషి తన బుర్రని గుద్దుకొంటా, గీసుకొంటా, భూగోళముపై పారాడతా ఆకాశముల తేలాడతా దేవుడంటే తెలిసి తెలిసి… తెలిక తెలికా… ఆ మతం వాణ్ణి ఈ మతం వాణ్ణి నరికి, నా మతమే పుడ్డింగి మతము అని పెద్ద పెద్ద పొత్తాలు రాసి భక్తిని రక్తి కట్టిస్తా ముక్తి కోసరము మూలుగులాడతా వుండాడురా”

“వీడి మూలుగులకి దేవుడు మైమరుస్తాడానా”

“దేవుని పేరులా మనిషి మనిషిని చంపమనే పాడు బుద్దిని ఏ దేవుడు మెచ్చుకొంటాడురా? వీడి మూలుగులకి ఏ దేవుడు మైమరుస్తాడురా? అయినా దేవుడుండేది జీవుడిలా. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. ముందు అది తెలుసుకోరా” అని పొయ అన్న.

***

మూలుగులు = మెలికలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here