[dropcap]”బి[/dropcap]డ్డ తప్పు చేస్తే తనలా మూసిపెట్టుకొని (దాచుకొని) ఒప్పు చేస్తే మురిసిపోయే గుణం అమ్మకే వుంది. అమ్మ మనసుకి సరితూగే మనసు ఈ జగతులా ఇంగెవరిది లేదు కదనా” అంటా కిచ్చన్నని అడిగితిని.
“నీ మాట నిజమే కాని అమ్మ మనసుకు సరితూగే మనసు ఈ జగతుల ఇంగొగరిది వుందిరా” అనె.
“అట్లనా?
“ఊరా”
“ఎవరి మనసునా అది”
“అబ్బ మనసురా”
“ఎట్లనా”
“రేయ్! అమ్మ నొప్పి కాకుండా కొడుతుంది. అదే అబ్బ నొప్పి అయినట్ల గట్టిగా కొట్టి, ఆ మీట తను నొప్పి (బాధ) పడతాడురా. అదేరా అబ్బ మనసు” అని పొయ అన్న.
***
అబ్బ మనసు = నాన్న మనసు