[dropcap]”పుం[/dropcap]గు పురాణం అంటే ఏమినా?”
“నీకి ఎట్ల చెప్పేది?”
“ఎట్లైనా చెప్పు అదేమో చెప్పు”
“అట్లంటావా?”
“నేను అట్లే అంటా, ఇట్లే అంటా”
“సరేరా! నా మాటకి బదులు చెప్పరా”
“కానీనా”
“ఒక రకం చెట్టుకు ఆ రకం కాయి, పండ్లు కాస్తాయి కదరా”
“అవునునా”
“మనిషికి మనిషే పుడతాడు కదరా”
“అవునౌనునా”
“అట్ల కాదు ఇట్ల కాదు. మనిషి వర్ణానికి పుడతాడు అని చెప్పేదే పుంగు పురాణంరా”
“ఓ… అట్లనా… ఇదేనా పుంగు పురాణమంటే”
“అవునురా… దీంట్లా పుంగు మాటలకి, దొంగవేషాలకి కొదవే లేదురా”
“ఈడ కూడా ఎవురూ బిట్టిగా లేదు లేనా అది విని ఇరివి (బడాయి) మాటలు మాట్లాడేకి…”
***
పుంగు = ఉత్త