డా. సి. ఆనందారామం గారికి నివాళి

0
10

[box type=’note’ fontsize=’16’] ది 11-02-2021న దివంగతులైన సుప్రసిద్ధ రచయిత్రి డా. సి. ఆనందారామం గారికి నివాళి అర్పిస్తూ తాను వారితో గతంలో జరిపిన ఇంటర్వ్యూను పాఠకులకు అందిస్తున్నారు మణినాథ్ కోపల్లె. [/box]

 

సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలించేది మాతమ్రే కాదు సమాజానికి మార్గదర్శకం కూడా!

[dropcap]“సా[/dropcap]హిత్యంలో కనిపించే ప్రతిఘటన కాని సమర్థన కాని, సమాజ పగ్రతికి ఎంతవరకు దోహద పడుతున్నాయి అనేది విశ్లేషణతో సాగేది వ్యవస్ధాగత తులనాత్మక పరిశీలన. మానవ సమాజ ప్రగతి ప్రస్ధానానికి మార్గదర్శక సూత్రాలను ఏర్పరచ గలుగుతుంది.” అని అంటారు ప్రముఖ నవలా రచయిత్రి డా॥సి.ఆనందారామం.

***

డా. ఆనందారామం గారు ఏలూరులో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. రామాయణ భాగవతాలు చదువుతూ సాత్విక వాతావరణంలో పెరిగారు. చదువు ఏలూరులోనే బి. ఏ. వరకూ సాగింది. 1957లో రామం గారితో వివాహం.. అనంతరం గృహిణిగా వుంటూనే తన చదువు కొనసాగించారు. వివాహానికి ముందు నుంచే కథలు రాసేవారు. “ఆటుపోటు” అనే కథ ఆంధ్రప్రభలో వచ్చింది. వివాహానంతరం తన రచనలు కొనసాగించి నవలా రచయిత్రిగా పేరు పొందారు. వారి గురించి తెలుగు సాహిత్య రచనల గురించి వారి అభిప్రాయం..

తన చిన్నతనం నుంచీ రచనలు చేస్తున్నడా. సి ఆనందారామం గారి తొలి నవల 1961 ‘సంపెంగ పొద’ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికగా వచ్చింది. ఆనాటి నుంచీ నేటి వరకూ 61 నవలు, 3 కథా సంపుటాలు, అనేక పరిశోధనాత్మక రచనలు వీరి కలం నుంచి వెలువడ్డాయి. సుదీర్ఘ కాలం నుంచీ సాహితీ రచనారంగంలో వున్న వీరు నాటి సమాజంలో మహిళ ఆలోచనా తీరుతెన్ను గురించి నేటి వరకు ఎలా మార్పు చెందిందో … సాహిత్యం ఎలా వుండేదో వివరించారు.

ప్ర. నాటి సమాజంలో మహిళ ఆలోచనా విధానం ఎలా వుండేది…?

జ. 1960 నుంచి 1980 వరకూ సంధియుగంగా చెప్పచ్చు. ఆరోజుల్లో స్త్రీలు యస్‌.యస్‌.యల్‌.సి, గ్రాడ్యుయేషన్‌ వరకే చదివేవారు. గృహిణుగా ఉండేవారు. రాను రాను మహిళల్లో జాగృతి ఏఱ్పడింది. పాతకాలం నాటి ఆచారాల నుంచి బయటపడాలని, స్వతంత్రత ఉండాలి అని భావించేవారు. తమ వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాని, తమకి ఒక గుర్తింపు రావాని కోరుకున్నారు. అప్పటి పాత తరం వాళ్ళు దీన్ని తొందరగా జీర్ణించుకోలేక పోయేవారు. ఉద్యోగం చేస్తే టీచరుగానే పనిచేయాలి అని అనేవారు. నా జీవితంలోనూ ఎన్నో ఒడిదిడుకులు వున్నాయి. ఇటు రాజీ పడలేను. ఎదిరించి ధిక్కరించలేను. నా ఆశకు, ధ్యేయానికి భంగం కలిగించుకోలేదు. పెళ్ళి తరువాత ఎం.ఎ. చదివి పిహెచ్‌.డి. చేశాను. ఉద్యోగంలోనూ చేరాను.

ప్ర. 1980 తరువాత సమాజంలో వచ్చిన మార్పు ఎలా ఉండేవి?

జ. 1980 తరువాత సమాజంలోను, స్త్రీ జీవితాలోనూ మార్పులు వచ్చాయి. మహిళ జీవితం క్రొత్త మలుపు తిరిగింది. మహిళలు గ్రాడ్యుయేషన్‌తోనే చదువు ఆపలేదు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయటం, వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేయటం, ఇంట్లో సమస్యలు, మగవారితో సమానంగా ఆర్థిక బాధలు పంచుకునే అవకాశం వచ్చింది. స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితం అనుకునే దృక్పథం మారింది. మగవారికి ఉండే హక్కులన్నీ మహిళలకీ కావాలని కోరుకోవటం మొదలైంది.

ప్ర. గృహిణిగా వుంటూ వివాహానంతరం చదువుకున్న మీరు ఆ సమయంలో ఎదుర్కున్న సంఘటనలు, సమస్య ఏమైనా వున్నాయా?

జ. నేను చదువుకునేటప్పుడు మా పిల్లలు చాలా చిన్నవారు. వారి సంరక్షణార్ధం కుల మతాల కతీతంగా ఒక అమ్మాయిని ఇంట్లో వుంచాను. దానికి మా ఇంట్లో కొంత విముఖత నెదుర్కొనవసి వచ్చింది. చదువుకోవానే పట్టుదల, ధ్యేయం ముందు అవి ఎదుర్కొని, కష్టపడి చదువు పూర్తి చేశాను. పనిమనుషుల జీవితాల గురించి రాసిన నవలా ప్రక్రియే ‘భాష్యం’ అనే నవల.

ప్ర. మీ రచనల్లో మీకు ఇష్టమైనది…?

జ. ‘నానృషి: కృషితే కావ్యం’ ఎక్కువ ప్రచారం పొందింది. నాకు ఇష్టమైన నవల కూడా ఇది. బలహీనురాలైన కథానాయిక రచయిత్రి. ఆమె ఎప్పుడూ తనని తాను విమర్శించుకుంటూ, తనని తాను సంస్కరించుకుంటూ విజయం సాధిస్తుంది. ఈ నవల 1974 ఉగాది నవలల పోటీలో మూడవ బహుమతి పొందింది. ఈ నవల ‘శారద’ పేరుతో అచ్చయింది. కన్నడంలోకి అనువాదం అయింది.

ప్ర. ప్రస్తుతం సాహిత్యం చదివే పాఠకుల సంఖ్య తగ్గి ఇతరత్రా బిజీ అయిపోతున్నారు. తిరిగి పాఠకులు చదివేలా ఎలాటి సాహిత్యం రావాలంటారు…?

జ. సాహిత్యానికి కొత్త యాంగిల్‌ కావసిన అవసరం ఉంది. టెక్నిక్‌లో, శిల్పంలో మార్పురావాలి. వేగవంతమైన నడక రావాలి. అతి తక్కువ కాలం లో ఛమక్‌ మనిపించే శిల్పం రావాలి. మేధస్సుకి మిరుమిట్లు గొలిపే రచనలు ఇంతవరకూ రాలేదు. అలాంటి రచనయితే తప్ప ఈనాటి పాఠకుడు చదివేలా లేదు.

ప్ర. సాహితీ రూపాలు కాలానుగుణంగా ఎలా మారాయంటారు?

జ. 1960 దశకంలో సాహిత్య రంగంలో స్త్రీస్వాతంత్రోద్యమ రచనను రంగనాయకమ్మగారు చేశారు. సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పారు. 70 దశకాల్లో యద్ధనపూడి సులోచనారాణి రచనలు ప్రేమ కథాంశంతో వుండేవి. కథాశిల్పం, సంఘటనలు, కథ మొదలైనవన్నీ బాగుండేవి. హాయిగా వుండేవి ఆ రచనలను. ఎందరో వారిని అనుసరించి అనేక ప్రేమ కథలు రాశారు. ఆ తరువాత వచ్చిన యండమూరి వీరేంద్రనాధ్‌ ‘తుసీదళం’ నవ పాఠకలోకంలో ప్రబలమైన మార్పు తెచ్చింది. వారిని అనుసరిస్తూ అనేక దయ్యాలు, భూతాలు ఇతివృత్తాలుగా క్షుద్ర సాహిత్యం వచ్చింది. ఆ తరువాత థిల్లర్స్ వచ్చాయి. కొంతకాలానికి అవీ చప్పబడిపోయాయి. తరువాత స్వేచ్ఛానవలలు, స్రీవాద రచనలు కొంత కాలం వచ్చాయి. మళ్ళీ స్తబ్ధత వచ్చింది. ఇటువంటి సమయంలోనే కొత్త అంటు కావలసి వస్తుంది. తక్కువ నిడివిలో మెదడుని కుదిపే రచనలు రావాలి. అప్పుడే తిరిగి సాహిత్యం నిలబడి పాఠకులు చదవగలుగుతారు. ఈమార్పు ఎప్పుడు వస్తుందో ఎవరిద్వారా వస్తుందో చెప్పలేను. ఎదురు చూడాల్సిందే!

***

సమాజంలోని వ్యక్తుల మానసిక చైతన్యానికి ప్రతిరూపమైన సాహిత్యం. సమాజానికవసరమైన రీతిలో అది రూపొందుతుంది అని తన అభిప్రాయం తెలియజేసే డా॥ సి.ఆనందారామంగారు తన రచన ద్వారా ఎన్నో సామాజిక అంశాలను, సమస్యలను, మహిళా సమస్యలను, ప్రతిబింబిస్తూ…, మహిళను చైతన్యం కలిగించే రచనల సమాజానికి అందించారు.

‘ఇంద్ర సింహాసనం’ అనే సటైర్‌ రచన పౌరాణిక పాత్రలు అంటే ఇంద్రుడు, రంభ, కల్పవృక్షాలు ఇత్యాది పాత్రలు….. నేటి సమాజంలో రాజకీయ నాయకులు, వేశ్యలు, షావుకార్లు ఇత్యాది సమాజంలోని పాత్రలు…. పోలికతో ఎందరు రాజకీయ మార్పు వచ్చినా (ఎందరు ఇంద్రులు మారినా) మారని పరిస్ధితుల పై రచనలు …. ‘ఇదా భారతం’లోని కీచకుడి పాత్రని పోలుస్తూ నేటి సమాజం లోని పాత్రలు… భారతం ఈనాడూ నిలిచి ఉంది అని తెలుపుతూ పది భారత కథలు తీసుకుని ఈనాటి సమాజ సంఘటను పోలుస్తూ చేసిన రచనలు.. ‘తెలుగు నవలలో కుటుంబ జీవన చిత్రణము’ – పరిశోధనా గ్రంధము వంటివి చూస్తే వీరు నవలా రచయిత్రిగానే కాదు మంచి విమర్శకురాలు, పరిశోధనాత్మక రచయిత్రి కూడా అని తెలుస్తుంది.

‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు…’ అనే పాట ద్వారా నేటికీ అందరి మదిలో నిలిచిన చిత్రం ‘‘జ్యోతి’’ సృష్టికర్త ఆనందారామం గారు. దీనికి ‘మమత కోవెల’ అనే నవల ఆధారం. మద్రాసులో ‘కళాసాగర్‌’ అవార్డు నందుకుందీ చిత్రం.

ఎంతో జనాదరణ పొందిన ‘‘త్రిశూలం’’ చిత్రం ‘‘జాగృతి’’ నవల ఆధారంగా వచ్చింది. ఆ రోజుల్లో వీరి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనిత (ప్రేమ దీపాలు), ఆత్మ బలి (సంసార బంధం), ప్రేమ సూత్రం (జీవితం) మొదలైనవి.

వీరి రచనలు మైసూరు యూనివర్శిటి విద్యార్ధుకు తెలుగు పాఠ్యాంశాలుగా సెలక్టు అయ్యాయి.

‘వర్షిణి’ తాజా నవల గోదాదేవి ఇతివృత్తంగా సాగిన రచన. వీరు హనుమంతుని పాత్ర గురించి విశ్లేషించారు.

***

డా॥ ఆనందా రామంగారి జీవిత విశేషాలు ..

  • తెలుగులో ఎం.ఎ. పి.హెచ్‌డి.
  • సెంట్రల్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ
  • అధ్యాపకురాలిగా 30సంవత్సరాల అనుభవం
  • “ప్రాగ్రూప తులనాత్మక సాహిత్యం నవలా ప్రక్రియ” పరిశోధనాత్మక గ్రంథం,
  • సమాజ సాహిత్యాలు పరిశోధనాత్మక గ్రంథం, నవలా విమర్శ ఇవే కాకుండా 61 నవలలు, 3 కధా సంపుటాలు వీరి సాహితీ సృష్టి.
  • 37 మంది విద్యార్ధులకు ఎం.ఫిల్‌. డిగ్రీ ప్రధానం, 13మంది విద్యార్ధుకు పిహెచ్‌.డి. డిగ్రీ ప్రధానం ఇవ్వటం జరిగింది.
  • ‘అంటరానితనం’ సమస్యలపై భాష్యం, వెలుగుబాట, కాకి బంగారం, దీనబంధు, జాగృతి, దోషులెవరు, పాంచజన్యం ఇత్యాది నవలలు రచించారు.
  • పురాణగాథల ఆధారంగా సామాజిక అంశాలతో రచించినవి ‘ఇదా భారతం’, ‘ఇంద్ర సింహాసనం’.

ఇంకా అనేక అంశాపై వీరి రచనలు సాగాయి.

అవార్డులు:

  • ‘‘గృహక్ష్మి స్వర్ణ కంకణం’’ మద్రాసు కేసరి కుటీరం వారిచే..
  • ‘‘తుఫాను’’ నవలకి ‘రాష్ట్ర సాహిత్య అకాడమి’ అవార్డు..
  • “మాదిరెడ్డి సులోచన గోల్డ్‌ మెడల్‌ అవార్డు”.
  • “సమాజ సాహిత్యాలు”… సాహితీ విమర్శకి తెలుగు యూనివర్శిటీ అవార్డు.
  • చల్లపిళ్ళ వెంకట శాస్త్రి మెమోరియల్‌ షీల్డ్‌,
  • ఉత్తమ రచయిత్రి అవార్డు తెలుగు యూనివర్శిటీచే అందుకున్నారు.
  • సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, గోపీచంద్‌ అవార్డు స్వీకరించారు.

అనేక సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. లండన్‌, కౌలాలంపూర్‌, న్యూయార్క్‌ మొదలైన విదేశీ తెలుగు అసోసియేషన్‌ వారిచే సత్కారాలు పొందారు.

ప్రసిద్ధ నవలా రచయిత్రి డా. సి. ఆనందారామం గారికి మరోమారు నా నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here