[dropcap]ఉ[/dropcap]న్నత కారణాల కోసం ఆత్మార్పణలు చేసిన నిస్వార్థపరుల సంస్మరణం వీరశిలలు. చారిత్రకంగా ప్రాచీన కాలం నుంచి స్మారకాలు, వీరశిలలు వేయించే ఆచారం ఉంది.
ఇది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఎం.ఫిల్. డిగ్రీ కోసం సమర్పించిన పుస్తకం.
నాటి వీరులు సమాజానికి, పాలకులకు, సంస్కృతికి, మతానికి చేసిన సేవలను మనం పాటించి రాబోవు తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని ‘అభినందన’ రాసిన ఆర్. చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘విషయం పెద్దది కనుక ఎంత చెప్పినా తక్కువే అయినా, హితంగానూ, మితంగాను శాస్త్ర సమ్మతంగా చెప్పినందుకు’ డా. కపిలవాయి లింగమూర్తి ‘ప్రామాణిక పరిశోధన’ అని అభినందించారు.
‘క్షణభంగురమయిన జీవితమును ఉత్తమ ఆశయ సాధనకు వెచ్చించి వీరునిగా గుర్తింపు పొందడము చిరస్మరణీయము. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వీరశిలలను పరిశీలించి వీరుల చరిత్రను కొంతవరకైన వెలుగులోకి తేవడానికి చేసిన చిరు ప్రయత్నమిది’ అని రచయిత కొమ్మగోని శీనయ్య తన ముందుమాటలో రాశారు.
ఇలాంటి చరిత్ర పరిశోధనలు పుస్తకాల రూపంలో సామాన్య పాఠకులకు అందుబాటులోకి రావడం హర్షణీయం.
***
మహబూబ్‍నగర్ (ఉమ్మడి) జిల్లా వీరశిలలు పరిశీలన
రచన: కొమ్మగోని శీనయ్య,
పేజీలు : 116,
వెల : ₹ 100/-,
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు