సరిగ పదమని-15

0
3

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

జీవితానికి
బతకడమే
ముఖ్యం అనుకోకు –
ఊపిరితో సరిపెట్టకు –

కార్బన్ డై ఆక్సైడ్ కాదు –
ఆక్సీజనే వదులు!

~ ~

మానవజాతికి
పునాది ప్రణయం –
స్త్రీ పురుష భేదం
ప్రేమలో లయం –

గమనసూత్రం
సమాగమం!

~ ~

తీరంతో కెరటం
ఆడుతుంది సయ్యాట –
అంతలో కౌగిలించి
మరలి పోతుంది విడిచి!

సముద్రుడి కనుసన్నల్లో
అలుపు లేని వలపు!

~ ~

ఒకటే సీత –
ఒకటే బాణం –
గురి తప్పని ధర్మం
రాముని సూత్రం –

బహుముఖం
ఏకాగ్రత!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here