[dropcap]”నా[/dropcap] కొడుకు సరిగ్గా సరివెల్దునా ఏమి చేసేదో” బాధగా అంట్ని.
నా మాట వినిన అన్న ‘సంతోషం పడరా’ అనె.
“నువ్వింగా సరిపోయిండావునా, వాడు సదువు విడచి పెట్టి ఊరు చుడతా వుండాడునా”
“అంటే”
“ఆడే తప్పు జరిగె. ఇది అన్యాయం, ఇది అక్రమం ఇట్లనా”
“అట్లనా”
“ఊనా”
“అయితే నువ్వు ఇంగా సంతోషం పడరా”
“సంతోషం పడాలానా? ఏమినా నీ లెక్కలు”
“నాది బతుకు లెక్కలురా, సదివిన వాళ్లంతా యోగ్యులు కాదురా, నీ కొడుకు అట్లా ఊరుసుట్టేవాళ్లే యోగ్యులురా” అని పోయ అన్న.
***
ఆడా ఈడా = అక్కడ, ఇక్కడ